Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో మూడు రోజుల్లో రాబోతున్నాయి.. అయితే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ఓ అంచనాకు వచ్చాయి.. కొన్ని సర్వే సంస్థలు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి అధికారం దక్కడం ఖాయమని అంచనా వేస్తే.. మరికొన్ని టీడీపీ-జసనేన-బీజేపీ కూటమిదే విజయం అంటున్నాయి.. అయితే, మొత్తంగా మెజార్టీ సర్వేలు ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీ అని.. లోక్‌సభ ఫలితాల్లో మాత్రం కూటమి సత్తా చాటుతుందని పేర్కొన్నాయి.. ఇక, ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. ట్రెండ్ అయితే క్లియర్ గా కనబడుతుందన్నారు. వైసీపీకి సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ఉందని మా అంచనాగా పేర్కొన్న ఆయన.. ఎగ్జిట్ పోల్స్ కంటే ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయని అనుకుంటున్నాం అన్నారు. సీరియస్ గా చేసిన సర్వేల్లో వైసీపీ గెలుపు అని తేలినట్టు కనిపిస్తుందన్నారు. మహిళలు కేంద్రంగా వైసీపీ ప్రభుత్వంలో పని చేశాం.. అందుకే మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపారని వివరించారు. వైసీపీ ప్రచారం అంతా పాజిటివ్ గా సాగింది అని వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక, మీడియాతో మాట్లాడిన సజ్జల ఏఏ అంశాలపై స్పందించారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..