AP Elections 2024 Results: అనంతపురంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేపథ్యంలో ఈ రోజు, రేపు జేఎన్టీయు పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించి పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
* థామస్ మన్రో సర్కిల్ నుండి జేఎన్టీయూ రోడ్డుకు ఎడమ వైపున ఉన్న ఫెర్రర్ నగర్ 9 క్రాస్ లో నివసిస్తున్నవారు… శారద నగర్ 6 క్రాస్ లు, LIC కాలనీ 4 వ క్రాస్ లు, K మల్లప్ప కాలనీ 2 క్రాస్ లు, విద్యానగర్ 2 క్రాస్ లలో నివసిస్తున్న ప్రజలు మరియు సుశీల్ రెడ్డి కాలనీవాసులు వారి వాహనాల రాకపోకలు జేఎన్‌టియు రోడ్డు వైపుకు అనుమతి లేనందున ప్రత్యామ్నాయ మార్గమైన అనంతపురము-కదిరి రోడ్డు మీదుగా టౌన్ లోకి వెళ్లాలని సూచించారు.
* థామస్ మన్రో సర్కిల్ నుండి హిందూ శ్మశాన వాటిక దాటిన తరువాత జేఎన్‌టియు వరకు రోడ్డుకు కుడి వైపున ఉన్న SBI కాలనీలోని 3 క్రాస్ ల వారు జేఎన్‌టియు రోడ్డు వైపుకు అనుమతి లేనందున వారి రాకపోకలు ప్రత్యామ్నాయ మార్గమైన హౌసింగ్ బోర్డు నుండి RTO ఆఫీసుకు వెళ్ళు రోడ్డు మీదుగా టౌన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
* హౌసింగ్ బోర్డు 80 ఫీట్ రోడ్, పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా వారి రాకపోకలు హోసింగ్ బోర్డు 80 ఫీట్ రోడ్ సర్కిల్ చెక్ పోస్ట్ వైపు వచ్చేందుకు అనుమతి లేనందున వారు ప్రత్యామ్నాయ మార్గాలైన విద్యుత్ నగర్, అశోక్ నగర్ మీదుగా టౌన్ లోకి రాకపోకలు కొనసాగించాలన్నారు.
* రాప్తాడు, ప్రసన్నాయనపల్లి, ఇందిరమ్మ కాలనీ మరియు చిన్మయనగర్ కు చెందిన ప్రజలు వారి రాకపోకలకు జేఎన్టీయూ వైపు వచ్చేందుకు అనుమతి లేనందున ప్రత్యామ్నాయ మార్గాలైన అనంతపురము-కదిరి రోడ్డు మీదుగా గాని, లేదా ప్రసన్నాయనపల్లి రైల్వే స్టేషన్ నుండి నాయక్ నగర్ మీదుగా గాని టౌన్ లోకి వెళ్లాలి
* భైరవ నగర్ 2 వ క్రాస్ నుండి 17 వ క్రాస్ వరకు గల ప్రజల రాకపోకలకు జేఎన్‌టియు ప్రహరీ గోడ వెనుక వైపు భైరవనగర్-RTO ఆఫీసు రోడ్డు వైపు వచ్చేందుకు అనుమతి లేనందున వారు ప్రత్యామ్నాయ మార్గమైన భైరవనగర్ 9వ రోడ్డు మార్గం ద్వారా ప్రసన్నాయనపల్లి రైల్వే స్టేషన్ నుండి నాయక్ నగర్ వైపు వెళ్ళు రహదారి ద్వారా టౌన్ లోకి వెళ్లాలి
* రాప్తాడు, ప్రసన్నాయనపల్లి సంబందిత ప్రాంతాల సాదారణ ప్రజానీకం వారి రాకపోకలకు జేఎన్‌టియు ప్రహరీ గోడ వెనుక వైపున భైరవనగర్ మీదుగా RTO ఆఫీసు వైపు వచ్చేందుకు అనుమతి లేనందున, వారు ప్రత్యామ్నాయ మార్గాలైన అనంతపురము-కదిరి రోడ్డు మీదుగా గాని, లేదా ప్రసన్నాయనపల్లి రైల్వే స్టేషన్ నుండి నాయక్ నగర్ మీదుగా గాని టౌన్ లోకి వెళ్లాలి
* హౌసింగ్ బోర్డు వైపు నుండి సంబందిత ప్రాంతాల ప్రజలు వారి రాకపోకలకు చెక్ పోస్ట్ ను దాటి జేఎన్‌టియు, భైరవ నగర్, ప్రసన్నాయనపల్లి వైపు వెళ్ళుటకు అనుమతి లేనందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలి
ఇక, అనంతపురం పార్లమెంటు మరియు జిల్లాలోని అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులు, ఏజెంట్లకు సంబంధించిన వాహనాల పార్కింగ్ కోసం కొన్ని సూచనలు చేశారు..
* రాప్తాడు, అనంతపురం నియోజక వర్గాల వారీగా పోటీ చేసిన అభ్యర్థులు మాత్రము మొదటి గేట్ (సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద గల గేట్) ద్వారా లోపలికి వెళ్ళుటకు అనుమతి కలదు. వారి వాహనాలను జేఎన్‌టియు గ్రౌండ్ నందు వెనుక వైపున పార్కింగ్ చేసుకోవాలి
* శింగనమల, కళ్యాణదుర్గం మరియు ఉరవకొండ నియోజక వర్గాల వారీగా పోటీ చేసిన అభ్యర్థులు మాత్రము రెండవ గేట్ (ఆడిటోరియమ్ గేట్) ద్వారా లోపలికి వెళ్ళుటకు అనుమతి కలదు. వారి వాహనాలను జేఎన్‌టియు ఆడిటోరియమ్ పక్కన గల స్థలం నందు పార్కింగ్ చేసుకోవాలి
* తాడిపత్రి, గుంతకల్ మరియు రాయదుర్గం నియోజక వర్గాల వారీగా పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం మూడవ గేట్ (మెయిన్ గేట్) ద్వారా లోపలికి వెళ్ళుటకు అనుమతి కలదు. వారి వాహనాలను జేఎన్‌టియు మెయిన్ బిల్డింగ్ ముందు వైపు ఉన్న ఖాళీ స్థలం నందు పార్కింగ్ చేసుకోవాలి
* అనంతపురము పార్లమెంటు మరియు జిల్లాలోని రాప్తాడు, అనంతపురము, శింగనమల, కళ్యాణదుర్గం, ఉరవకొండ తాడిపత్రి, గుంతకల్ మరియు రాయదుర్గం నియోజక వర్గాల నుండి పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు వారి వాహనములను జేఎన్‌టియూ ప్రాంగణం దాటిన తరువాత పక్కనే గల పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేసుకొనవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో వారి వాహనాలకు జేఎన్టీయూ కాలేజ్ లోకి వెళ్ళేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.