గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళనకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 10 వేల 960 గ్రామ సచివాలయాలు, 4 వేల 44 వార్డు సచివాలయాలు ఉండగా.. దాదాపు లక్షా 61 వేల మంది గ్రామ, వార్డు సెక్రటరీలు ఉన్నారు. అవసరాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం..
సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలుపించుకుని మాట్లాడిన ఆసక్తిర సన్నివేశం గురువారం సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు ఏపీ సీఎం..
రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేశారు.. జులై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సీడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని ఆదేశించిన సీఎం. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని క్లారిటీ ఇచ్చారు.
విశాఖపట్నం సముద్ర తీరంలో ఓ ఫిషింగ్ బోటు తునాతునకలైంది. అలలధాటికి కొట్టుకుని వచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. దీనిని తరలించేందుకు ప్రయత్నించగా పూర్తిగా మునిగిపోయింది. దీంతో తీరం వెంబడి బోట్ శకలాలు చెల్లాచెదురుగాపడ్డాయి. ఉదయం ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన బోటు.. తిరుగు ప్రయాణంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఇంజిన్ మొరాయించడంతో విశాఖ తీరానికి సమీపంలో నిలిచిపోయింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ రెస్టారంట్’ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ప్రకటించడంతో జనం పోటెత్తారు. దాదాపు 2 వేల మంది బిర్యానీ కోసం ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్ కింద కేవలం 200 బిర్యానీ ప్యాకెట్లను మాత్రమే విక్రయించారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సమవేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు.. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులిచ్చి వారికి సముచిత స్థానం కల్పించాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించిందన్నారు.. పార్టీ కోసం పని చేసిన నేతలు.. కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు సూచించారు.