మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లను…
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం జరుగుతుంది.. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను దెబ్బతీసేలా కూడా పోస్టులు పెడుతున్నారట.. అయితే, ఏపీ బ్రాండ్ దెబ్బతీసేలా వస్తున్న కొన్ని సోషల్ మీడియా పోస్టింగులపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.. ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దనే రీతిలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారిపై నిఘా పెట్టింది సర్కార్.
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. వివాహేతర సంబంధంతో సహజీవనం చేస్తున్న పార్వతి అనే మహిళపై ప్రియుడు మోహన్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది..
పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ రివ్యూలో అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే అవి లేవని అధికారులు చెప్పడంతో.. కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం.. ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. రెండు రోజుల్లో కేసు ఫైల్‌ను సీఐడీకి అప్పగించనున్నారు పోలీసులు.
మాజీ మంత్రి రోజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. జిల్లాల్లో సీరియస్ పాలిటిక్స్ నడుస్తోన్న సమయంలో.. కనీసం ఎవరితోనూ టచ్‌లో లేకుండా వెళ్లిపోయిన రోజా.. యూరప్ ట్రిప్‌లో ఎంజాయ్ చేశారట.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడమే కాదు.. ఆమె డ్రెసింగ్ స్టైల్‌పై కూడా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.