వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్లో స్పందించారు దివ్వల మాధురి.. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. శ్రీనివాస్ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నిధులను భారీగా పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు..
హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకెళ్తాం.. గ్రామ ప్రజలను కాపాడుకుంటాం అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లా సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసులు రాకుండా ఆపగలిగారు.. అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే అన్నారు..
ఆంధ్రప్రదేశ్‌కి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఉపాధి హామీ నిధులు రూ.2812.98 కోట్లు మంజూరు చేసింది.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకుగానూ రూ.5743.90 కోట్లను మంజూరు చేసిందని.. ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో బిగ్ షాక్ తగిలింది.. పార్టీకి, పార్టీ పదవులకు కీలక నేత గుడ్‌బై చెప్పేశారు.. గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జి పదవితోపాటు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపించారు.