CM Chandrababu: కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అయితే, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయన్నారు.. ఫుడ్ డెలివరి ఇస్తున్నాం.. కానీ కొంత జాప్యం అయింది. ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాం. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాం. బుడమేరులో ఇంకా రెండు గండ్లు పూడ్చాల్సి ఉంది అని వెల్లడించారు.. నీళ్లు లేని సబ్ స్టేషన్లను పునరుద్దరిస్తున్నాం. కొన్ని చోట్ల మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నాం. ప్రస్తుతం వస్తున్న మున్సిపల్ నీటిని తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.. ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేస్తున్నాం అన్నారు. ఇక, ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా మృతుల బంధువులకు ఇస్తాం. చనిపోయిన వారెవరైనా ఉంటే ఆ మృత దేహాలను పోస్టుమార్టం చేశాం అన్నారు. ఇప్పటి వరకు ఆరు లక్షల మందికి ఫుడ్ అందించాం. గర్భిణులను ఇబ్బందులు పడుతున్నారు.. వారిని గుర్తించి సేఫ్ గా తరలిస్తున్నాం అన్నారు..
Read Also: Akkineni Family: వరద బాధితులకు అక్కినేని కుటుంబం సాయం ఎంతంటే?
ఇక, ఉదయం నుంచి ఎగువన వర్షపాతం నమోదైంది. కృష్ణా నదికి మరో 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చుంటే మరింత ప్రమాదం సంభవించేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.. భవానీపురంలో వచ్చిన నీళ్లు అన్ని ప్రాంతాలనూ ముంచెత్తింది. బుడమేరు ప్రవహాన్ని మళ్లించేందుకు తీసుకున్న చర్యలేవీ అమలు కాలేదన్నారు.. బుడమేరు సమీపంలో 2019 నుంచి ఆక్రమణలు పెరిగాయన్న ఆయన.. బుడమేరు కాల్వ.. వాగును లేకుండా ఆక్రమణలు వచ్చాయి. గత ఐదేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఏం గాడిదలు కాస్తోంది అంటూ మండిపడ్డారు.. బుడమేరు ఆక్రమణలపై సర్వే చేయమన్నాం అన్నారు.. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ గట్లను కూడా తవ్వేశారు. వైసీపీ చేసిన తప్పుకు అమాయకులు ఇబ్బంది పడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు ఒక్క రోజు జీతం విరాళం ఇవ్వడానికి మందుకొచ్చారు. పరిస్థితిని నార్మల్ స్థితికి తీసుకురావాలి. సాయంత్రం లేదా రేపట్నుంచి నిత్యావసర వస్తవుల పంపిణీ చేపట్టనున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లేలా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. ఇలాంటి విపత్తులను అందరూ సమిష్టిగా ఎదుర్కోవాలి. వరద బాధితులు అందరికీ న్యాయం చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..