Minister Nimmala Ramanaidu: బుడమేరు కాలువకు పడిన గండ్లు పూడ్చే వరకు తాను అక్కడ నుంచి కదిలేది లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. కాలువకు మూడు ప్రాంతాలలో గండి పడటం వల్లే విజయవాడలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని ఆయన పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాలలో రాత్రి కురిసిన వర్షాలకు మరింత నీటిమట్టం పెరిగినట్లు ఆయన వివరించారు. గూడేరు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కు గండ్లు పడడం వల్ల సింగ్ నగర్, జక్కంపూడి, ఆంధ్రప్రభ కాలనీ, రాజరాజేశ్వరి పేట వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. కాలువ గండ్లు పూడ్చి అక్కడి నుంచి కదులుతానని ఆయన వివరించారు.
Read Also: Fish Venkat: దీనస్థితిలో నటుడు .. నిర్మాత సాయం
కాగా, బుడమేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది.. బుడమేరు వంతెన ప్రాంతంలో బ్రిడ్జ్ లెవెల్ కు పొంగి ప్రవహిస్తోంది వాగు.. గత నాలుగు రోజులుగా ఇదే తరహాలో ఉధృతంగా ప్రవహిస్తోంది బుడమేరు.. ఎగువ ప్రాంతాల్లో నీరు వచ్చి చేరటమే ఉధృతికి కారణం అంటున్నారు స్థానికులు.. గత ఐదు దశాబ్దాల కాలంలో ఈ తరహా ఉధృతి చూడలేదని స్థానికులు చెబుతున్నమాట.. ఇక, వర్షం పడితే వదర ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంటుందని సమీప కాలనీ వాసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, బుడమేరు వద్దే తిష్టవేసిన మంత్రి నిమ్మల రామానాయుడు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..