CM Chandrababu: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్ర స్థాయి పర్యటనతో సీఎం భద్రతా సిబ్బంది, అధికారులు పరుగులు పెట్టారు.. వరదలో.. అందునా జేసీబీపై నాలుగున్నర గంటల పాటు 22 కిలో మీటర్లు పర్యటించిన సీఎం చంద్రబాబు. కాన్వాయ్‌ని వీడి 22 కిలోమీటర్ల మేర పర్యటించడం ఇదే తొలిసారంటున్నాయి అధికారిక వర్గాలు. ప్రతిపక్షంలోనూ ఇంత సేపు కాన్వాయ్‌ని వీడి ఉండలేదన్న చంద్రబాబు భద్రతా వర్గాలు. వరద ప్రాంతంలోకి సీఎం చంద్రబాబు.. జేసీబీపై వెళ్లడంతో రోడ్ల పైనే చక్కర్లు కొట్టింది కాన్వాయ్.. భవానీపురం, సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో జేసీబీపై సీఎం పర్యటన కొనసాగింది.. ఒక పాయింట్ నుంచి మరో పాయింటుకు వెళ్లాలని స్పాటులోనే చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.. వరద పర్యటన అనంతరం కూడా సీఎంను చేరుకోలేకపోయింది కాన్వాయ్.. వరద లేని ప్రాంతంలో కూడా కొంత దూరం జేసీబీపైనే పర్యటించి రామవరప్పాడు వద్ద కాన్వాయ్‌కి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. వరద బాధిత ప్రాంతాల్లో అందుతున్న సాయాన్ని పర్యవేక్షించి, ప్రజలకు ధైర్యం చెప్పిన సీఎం.. 22 కిలోమీటర్ల మేర దారి పొడవునా బాధితులతో మాట్లాడుతూ ముందుకు సాగారు..
Read Also: Cardamom: చిన్నవిగా ఉన్నాయని తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..