CM Chandrababu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయుడు.. అమరావతి మునిగిందా..? వీళ్లను పూడ్చాలి.. అప్పుడే బుద్ది వస్తుంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.. ఒక్క వ్యక్తి అహంభావం వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడాలా..? ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా..? ఇలాంటి రాజకీయ నేరస్తులను.. తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని కామెంట్ చేశారు.. వైసీపీ లాంటి పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదన్న సీఎం.. సాయం చేయకపోగా నిందలేస్తారా..? తప్పుడు ప్రచారం చేపడతారా..? ప్రజల కోసం నేను యజ్ఞం చేస్తుంటే.. వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: Nannapaneni Sadhasiva Rao : రాష్ట్రానికి రెఫరల్ ఆసుపత్రిగా నాట్కో క్యాన్సర్ కేంద్రం
ప్రజలకు సేవ చేయాలి.. మరోవైపు రాక్షసులతో యుద్దం చేయాల్సి వస్తోందన్నారు సీఎం చంద్రబాబు.. బురద జల్లడం ఆపాలి.. సిగ్గుంటే క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసేవాళ్లని సహించను అని వార్నింగ్ ఇచ్చారు.. నా ఇంటిలోకి నీళ్లొస్తే.. వస్తాయి.. నీళ్లు వస్తాయి.. వెళ్తాయి. సంక్షోభ సమయంలో నేను దాని గురించే ఆలోచన చేస్తున్నా.. నా గురించి కాదన్నారు చంద్రబాబు.. ఇక, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడాను. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరాను అని వెల్లడించారు.. విజయవాడలో రాజధానిలో భాగం.. ముంపు బారిన పడకుండా కార్యాచరణ రూపొందిస్తాం అన్నారు.. ఇదే సమయంలో.. బోట్లల్లో తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు.. ప్రైవేట్ బోట్ల వాళ్లూ డబ్బులు వసూలు చేయకూడదు.. తరలింపు కోసం డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేస్తాం అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.. నిత్యావసరాలు.. కూరగాయల ధరలకు ప్రభుత్వమే ఫిక్సడ్ రేట్ పెడతాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..