Minister Nara Lokesh: బుడమేరు గండి పూడ్చే పనులను డ్రోన్ లైవ్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారా లోకేష్.. క్షేత్రస్థాయిలో ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు.. వివిధ శాఖల సమన్వయంతో అవసరమైన యంత్రాలు, సామాగ్రిని అక్కడి పంపిస్తున్నారు లోకేష్. ఇక, బుడమేరు దగ్గర జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీఎంకు డ్రోన్ లైవ్ వీడియో చూపిస్తూ పనులు జరుగుతున్న తీరు, వేగవంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు లోకేష్. ప్రధానంగా 2, 3 వంతెనల వద్ద పడిన గండ్లపై దృష్టి పెట్టామని తెలిపారు..
Read Also: Creta Knight: హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్స్ వివరాలివే..
బుడమేరు గండి పూర్చే పనులను గంటగంటకు సమీక్షిస్తున్నామని తెలిపారు మంత్రి నారా లోకేష్.. ఈ రెండుచోట్ల నుంచే వరద నీరు అజిత్ సింగ్ నగర్ లోకి ప్రవేశిస్తున్నదని చెప్పిన ఆయన.. ప్రస్తుతం బుడమేరులో 5వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని వెల్లడించారు.. అది కాస్తా 8 వేల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు.. సాధ్యమైనంత త్వరగా గండ్లను పూడ్చడానికి అన్ని చర్యలు చేపట్టామని వెల్లడించారు.. మరోవైపు.. కృష్ణా నదిలో భారీగా తగ్గింది వరద ప్రవాహం.. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుత ప్రవాహం 3,93,952 క్యూసెక్కులుగా ఉంది.. ఇక, విజయవాడ నగరంలో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టారు అధికారులు..