చిన్న పరిమి గ్రామానికి చెందిన బాధితుడు అజ్గర్‌ను ఈ నెల 30వ తేదీన కొందరు యువకులు పని ఉందంటూ చండూరు డొంకలోకి తీసుకు వెళ్లి మద్యం తాగించారు. వారు కూడా మద్యం సేవించారు.. ఆ తర్వాత ఏవేవో కారణాలు చెబుతూ యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బెల్టులు తీసుకుని చితకబాదారు. బాధిత యువకుడు కొట్టొద్దని మొత్తుకున్నా, కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా
ఏపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు మాజీ సీఎం వైఎస్ జగన్.. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వారు ఇష్టానుసారం దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. దాడులు చేసి ఏమి సాధిస్తున్నారో తెలియడం లేదన్న ఆయన.. ఇలాంటి కిరాతకాలు దారుణాలతో ప్రజలను ఎవరూ భయపడరు.. ఇదంతా ప్రజల్లో కోపంగా మారి టీడీపీని బంగాళాఖాతంలో కలిపేలా చేస్తుందని హెచ్చరించారు.
విశాఖపట్నంలో ఈ రోజు వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆ ఐదుగురు కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పార్టీ కండువా కప్పి.. జనసేన పార్టీలోకి ఆహ్వానించారు..
ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు.. ప్రస్తుతం నీటి లభ్యత ఎక్కువగా ఉన్నందున కాల్వలకి నీటి విడుదలపై ఆరా తీశారు.. అయితే, కృష్ణా జిల్లా ఎస్ఈ ప్రసాద్ బాబుపై మంత్రి నిమ్మల అసహనం వ్యక్తం చేశారు.. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటి విడుదల విషయంలో ఎస్ఈ నిర్లక్ష్యంపై నిమ్మల సీరియస్ అయ్యారు.. ఎస్ఈ ప్రసాద్ బాబుని ఈఎన్సీ కార్యాలయానికి సరెండర్ చేయాలని మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు..
ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా.. ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు ప్రజా గాయకులు గద్దర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేం అన్నారు.. పీడిత వర్గాల గొంతుకగా గద్దర్ నిలిచారు. తన పాటనే అస్త్రంగా చేసుకొని గద్దర్ ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు గద్దర్ తన గానంతో చైతన్యాన్ని రగిల్చారని పేర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు.. ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై హాట్ కామెంట్లు చేశారు.. చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాదర్భార్లు నిర్వహించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజలకు మంచి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ఇక, గత ప్రభుత్వం అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదని విమర్శించారు..
యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపిన విషయాన్ని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆన్ లైన్లో యూట్యూబ్ గ్లోబల్ సీఈవోతో చర్చలు జరిపినట్లుగా ట్వీట్ చేశారు.. యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్ మోహన్, గూగుల్ APAC హెడ్ సంజయ్ గుప్తాలతో సమావేశమయ్యాను. లోకల్ పార్టనర్లతో కలిసి యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆహ్వానించామని పేర్కొన్నారు
ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు..