రాజమండ్రిలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు.. కిడ్నాపర్ మారోజు వెంకటేష్ పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ కు గురైన అక్కాచెల్లెళ్లైన ఇద్దరు బాలికలు సేఫ్గా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మరో మూడు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఇవాళ హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకోన్న ఆయన.. ఉదయం 11 గంటలకు సెక్రటేరీయేట్కు వస్తారు.. ఇక, వివిధ శాఖపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు.. వైద్య-ఆరోగ్య శాఖ, రవాణా శాఖ, యువజన మరియు క్రీడల శాఖలపై ఈ రోజు సీఎం రివ్యూ చేస్తారు. నూతనంగా తీసుకువస్తున్న ఇండస్ట్రియల్ పాలసీపై అధికారులతో చర్చిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు..
తెల్లవారితే తన తమ్ముడు లక్ష్మణరావు వివాహం జరిపేందుకు అన్న చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెళ్లి చేయడానికి సిద్ధపడి ఏర్పాట్లలో మునిగిపోయారు.. అయితే, రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో పెళ్లి కుమారుడి అన్న చంద్రశేఖర్ మృతి చెంది అనంతలోకాలకు వెళ్లిపోయాడు
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత రబీ సీజన్లో ధాన్యం విక్రయించి.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం.. పాత బకాయిలను అందించడానికి ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు అలజడి సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి.. బీభత్సం సృష్టిస్తున్నాయి.. కురుపాం మండలంలోని గిరిశిఖర ప్రాంతంలో ఒక గుంపు, జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లి మండలాలలో ఒక గుంపు గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
అక్టోబర్ 1వ తేదీ నుండి నూతన మద్యం పాలసీ అమలుపరుస్తాం అన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కలెక్టరేట్లో మైనింగ్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర.. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీలపై అధ్యయనం చేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నిటిని భ్రష్టు పట్టించింది.. మద్యం పాలసీ సైతం భ్రష్టు పట్టిందని ఫైర్ అయ్యారు
పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ 110వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన " బతుకంతా దేశానిది" నాటకం ప్రేక్షకులను అలరించింది.
ప్రియుడి మోజులో పడ్డ ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. ఆపై హత్యను.. చాకచక్యంగా ఆత్మహత్యగా చిత్రీకరించి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అంతా ఆత్మహత్యగా భావించినా.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆగస్టు 3వ తేదీన జరిగిన హత్యను పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు పోలీసులు..