పుట్టుక నీది.. చావు నీది బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ 110వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో తెలంగాణ ఎథ్నిక్ థియేటర్ ఆర్ట్స్ సొసైటీ (TETA) బృందం ప్రదర్శించిన " బతుకంతా దేశానిది" నాటకం ప్రేక్షకులను అలరించింది.
ప్రియుడి మోజులో పడ్డ ఓ వివాహిత కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. ఆపై హత్యను.. చాకచక్యంగా ఆత్మహత్యగా చిత్రీకరించి అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే, అంతా ఆత్మహత్యగా భావించినా.. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆగస్టు 3వ తేదీన జరిగిన హత్యను పోలీసులు అత్యంత చాకచక్యంగా చేధించారు పోలీసులు..
ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టీడీపీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట.. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను ఇటీవలే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపిన ఆయన.. గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట.. గతంలో ఆయన టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట..
రాజకీయ నేతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించాలన్నారు.. ప్రజా నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి.. అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు సమస్యలను చెప్పుకోగలరు అన్నారు..
నా ఇంటిలో ఒక విచిత్ర పరిస్థితి.. నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలి.. కానీ, వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ.. మైన్ను తన పేరు మీద మార్చాలని వాణి ఒత్తిడి చేసేది.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసిది అన్నారు..
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రానికి ఒక్క ఫ్యాక్టరీ రాలేదు కదా.. రాష్ట్రంలోని 8 ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లాయని ఆరోపించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. వైసీపీలో ఐదు సంవత్సరాలు పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నాని హాట్ కామెంట్లు చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ వాక్ థాన్ జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత.. సైబర్ సోల్జర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబుకి అభినందనలు తెలిపారు..
ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (APNTF) విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది.. డ్రగ్స్, గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని పేర్కొంటోంది ఆంధ్ప్రదేశ్ ప్రభుత్వం.. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో APNTF ఏర్పాటు చేయనున్నారు.. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్.. 26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోస్ సెల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది కూటమి సర్కార్.
ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను.. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అన్నారు టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి..