ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం.. జాతీయ ఎస్సీ కమిషన్ను కలిసింది.. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాను కలిశారు వైసీపీ నేతలు.. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు.
సోషల్ మీడియాలో గుట్టుగా చిన్నారులకు విక్రయాలు సాగిస్తోంది ఓ కిలాడీ మహిళ.. వాట్సాప్ ద్వారా ముక్కుపచ్చలారని చిన్నారులను అమ్మకానికి పెడుతోంది.. తాడేపల్లి నులకపేటలో ఓ వ్యక్తికి వాట్సాప్ లో కిలాడీ మహిళ ఆఫర్ పెట్టడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది.
ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష.. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టులో దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ.. ఇక, వంశీ పిటిషన్పై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు .
తిరుమలలో పవిత్రోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. దీంతో.. ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ).. ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. శ్రీనివాసులు వయస్సు 48 ఏళ్లు.. అయితే, తెల్లవారుజామున బహిర్భూమికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాసులు.. ఈ సమయంలో ఆయన కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని దండగులు హత్య చేశారు.
NTV Daily Astrology As on 14th August 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..