Duvvada Vani vs Divvala Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారం కాస్తా రచ్చకెక్కింది.. ఈ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. గత నెల రోజులుగా దువ్వాడ వాణి.. కామార్తె హైందవి.. వివాదాస్పదంగా మారిన ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు దివ్వెల మాధురి.. ఆ ఇంట్లో ప్రత్యక్షం కావడంతో.. మరోసారి దువ్వాడ వ్యవహారం చర్చగా మారింది.. అయితే.. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిపెట్టేది లేదంటున్నారు దువ్వాడ వాణి.. ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్నారు వాణి, కుమార్తె హైందవి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వాణి.. కేసు కోర్టులో ఉంది.. మాకు ఆర్డర్ కూడా వచ్చింది.. ఇంటిలో ప్రవేశానికి కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు.. కోర్టు ఆదేశాలు ఉండగా.. మాధురి చేసుకున్న రిజిస్ట్రేషన్ చెల్లదు అంటున్నారు.. ఇది కోర్టు ధిక్కారం కిందకి వస్తుందంటున్నారు.. ఇక, మా ఆస్తి తీసుకొని, రకరకాల ఇల్లీగల్ పనులు చేస్తుంది అంటూ దివ్వెల మాధురిపై మండిపడ్డారు.
Read Also: Duleep Trophy: 7 వికెట్లు, 7 మెయిడిన్లు.. విరుచుకుపడ్డ బౌలర్, ఇంతకీ ఎవరు..?
నా ఆస్తి ఐదున్నర ఎకరాలు అమ్మి ఇల్లు కొన్నాం.. నా ప్రాణం పోయినా ఈ ఇల్లు విడిచిపెట్టను అంటున్నారు దువ్వాడ వాణి.. నా పలాస ఆస్తి అమ్మి కొన్న ఇల్లు ఇది.. బగవంతుడు ఉన్నాడు.. మోసం చేయడు.. పిల్లలకు ఇల్లు చెందుతుందని బావిస్తున్నాను అన్నారు. మరోవైపు పోలీసుల రక్షణ అడుగుతున్నాం.. పొలీసుల సహకారంతోనే ఆ ఇంట్లోకి అడుగుపెడతాను అన్నారు.. ఇక, నా భర్త నన్ను మోసం చేస్తాడని భావించలేదు.. నా పిల్లలకు చీట్ చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. పితృఅర్జితం ఒక్క రూపాయి రాలేదు.. మా అస్తులు అమ్మి సంపాదించిన ప్రాపర్టీ ఇది అన్నారు.. నా పిల్లల కోసం ఒక ఇంటిలోనే ఉండాలని కోరుకున్నానని తెలిపారు దువ్వాడ వాణి..