Nandikotkur Crime: నందికొట్కూరులో మహిళ హత్య కేసులో సంచల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. నంద్యాల జిల్లాలో బిహారీ యువకుడు, మరొకరితో కలసి ఓ సస్పెక్ట్ షీట్‌లో ఉన్న మహిళను తుపాకీతో కాల్చి , నరికి చంపిన ఘటన సంచలనం సృష్టిస్తుండగా.. నందికొట్కూరులో నిన్న జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే, శుక్రవారం రోజు శాలు బీ(40) అనే మహిళను చందు అనే యువకుడు, బీహార్ కు చెందిన మరో యువకుడితో కలసి హత్య చేశాడు. ఇంట్లో ఉన్న శాలుబీని నాటు తుపాకీతో కాల్చి, నరికి చంపినట్లు వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో శాలుబీ మృతదేహంలో నాటు తుపాకీ బుల్లెట్లు లభ్యమైనట్లు సమాచారం.
Read Also: Hyderabad: మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..
ఇక, నిందితుల్లో బిహారీ యువకుని గదిలో 2 నాటు తుపాకులు, 8 బుల్లెట్లు లభ్యమైనట్టు తెలుస్తోంది.. అయితే, సదరు మహిళను తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు బయటికి వెల్లడించడం లేదు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హత్యకు గురైన శాలుబీ పై సస్పెక్టేడ్ షీట్ ఉంది. శాలు బీపై నందికొట్కూరులో 6 కేసులు, కర్నూలులో 4 కేసులు నమోదయ్యాయి. హత్య సహా పలు చోరీ కేసుల్లో నిందితురాలిగా ఉంది శాలు బీ. 2015 లో నందికొట్కూరులో గజేంద్ర అనే వ్యక్తిని శాలుబీ మరో మహిళతో కలసి హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారంగానే శాలుబీని గజేంద్ర కుమారుడు చందు.. బీహారీ యువకునితో కలసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. కానీ, శాలుబీ హత్యపై కీలక విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.