గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టింది.. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట పండించిన అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి.. రైతులను గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రత్యక్షంగా చూశాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్
శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. ఎల్లుండి సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుల వారి ఉరేగింపుతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఇప్పటికే రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్ ఈ కేసులో వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.. ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో గండి బాజ్జీ.. పీలా గోవింద్, బైరా దిలీప్ ముందు వరుసలో ఉన్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రం లోగా టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారని తెలుస్తోంది..
కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడం వల్ల గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి.. అంతేకాదు 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోంది.. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గోట్టిపాటి రవితో కలిసి దర్శించుకున్న మంత్రి అనగాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులున్నారని పేర్కొన్నారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వ్యవహారంపై వాడివేడీగా చర్చ సాగుతోంది.. ఓ వైపు ఆయన.. మరోవైపు భార్యా పిల్లలు.. ఇంకో వైపు మాధురి.. ఇలా ట్విట్టుల మీద ట్విస్టులు.. మలుపుల మీద మలుపులు అన్నట్టుగా సాగుతోంది ఈ వ్యవహారం.
రాజమండ్రిలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు.. కిడ్నాపర్ మారోజు వెంకటేష్ పోలీసులకు చిక్కాడు. కిడ్నాప్ కు గురైన అక్కాచెల్లెళ్లైన ఇద్దరు బాలికలు సేఫ్గా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు