ఎన్టీవీతో మాట్లాడిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. మాది ముప్పై ఏండ్ల వైవాహిక జీవితం. గత రెండేళ్లుగా తీవ్రవిభేదాలు నడుస్తున్నాయి.. ప్రతి రోజూ మా ఇంటిలో గొడవలే. నా భార్యకు ఉన్న రాజకీయం కాంక్ష , ఆధిపత్యపోరే దీనికి కారణంగా చెప్పుకొచ్చారు.. నేనే ఎమెల్యే కావాలి, బిజినెస్ నాపేరున ఉండాలి అనేది ఆమె వైనంగా పేర్కొన్న ఆయన.. పెళ్లి అయిన ఒకటి రెండు ఏళ్లకే ఇది మొదలైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు హైడ్రామా నడుస్తుంది. గత రెండు రోజులుగా దువ్వాడ సతీమని వాణి, ఆమె కుమార్తెలు తమ తండ్రి, ఎమ్మెల్సీ దువ్వాడ తీరును తప్పు బడుతు రచ్చకెక్కారు. దీంతో శ్రీనివాస్ ఇంటి వ్యవహారం మరోసారి రోడ్డున పడింది. టెక్కలిలోని అక్కవరం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉంటున్న ఆయన ఇల్లు , కార్యాలయం వద్దకు కుమార్తెలు రావడం ఆయన తలుపులు తీయకపోవడంతో విషయం రచ్చకెక్కింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇక, శుక్రవారం రాత్రి మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు.. పారిస్ ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల రెజ్లింగ్‌లో భారత గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం.. అంటే.. ఇప్పటి వరకు భారత్ ఒక రజతం మరియు ఐదు కాంస్యం పతకాలు తన ఖాతాలో వేసుకుంది.. తన తొలి ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌పై అమన్ 13-5 తేడాతో గెలుపొందాడు..
జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బీజేపీతో అంటకాగి, ఆ పార్టీ ఆడించినట్టు ఆడి... ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ. పార్టీలే వేరు కానీ... బీజేపీ నేతలు మేం వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ. ఒకట్రెండు సందర్భాల్లో మినహా ఎక్కువ, కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో బాసటగా నిలిచింది. అలాంటి వైసీపీ... ఓడిపోయాక రూట్ మార్చేసినట్టు కనిపిస్తోందట.
విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉందిగానీ... అందు కోసం ఆయన చేస్తున్న స్టంట్స్ పరువు తీసేస్తున్నాయన్న టాక్ బలంగా ఉందట నియోజకవర్గంలో. చిన్నచిన్న విషయాలను సాతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్ అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి.