Budameru: కృష్ణా జిల్లా బుడమేరులో ఓ కారు కొట్టుకుపోయింది.. కేసరపల్లి ఉప్పులూరు రహదారిలో బుడమేరు కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది.. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళ్తున్న ఓ వ్యక్తి.. కారుతో సహా కొట్టుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు.. పేడన గ్రామానికి చెందిన కలిదిండి ఫణిని కారు యజమానిగా గుర్తించారు.. అయితే, కారులో ఉన్నాడా? లేదా? అనేదాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.. అయితే, చివరకు బుడమేరు కాల్వలో కారును గుర్తించారు పోలీసులు.. మరి కారులో ఫణి ఉన్నాడా? తప్పించుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.. కాగా, బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసిన విషయం విదితమే.. ఆ తర్వాత బుడమేరు కాలువకు పడిన గండ్లను పూడ్చి వేసింది ప్రభుత్వం..
Read Also: Sunita kejriwal: హర్యానాలో సునీతా ఎన్నికల ప్రచారం.. మోడీకి కేజ్రీవాల్ తలవంచరని వ్యాఖ్య