Aavesham 2: రంగన్న ఈజ్ బ్యాక్! ‘ఆవేశం 2’పై ఫహద్ ఫాజిల్ అఫీషియల్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్ర పరిశ్రమలో సుమారు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసిన చిత్రం ‘ఆవేశం’. ఫహద్ ఫాజిల్ పోషించిన ‘రంగన్న’ పాత్రకు భాషాభేదం లేకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైన తర్వాత ఈ సినిమా సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో నటుడు పాల్గొన్న ఫహద్, ఈ ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ అందరినీ ఖుషీ చేశారు.
ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. ‘ఆవేశం 2’ కచ్చితంగా ఉంటుందని, రంగన్న పాత్రను మళ్ళీ వెండితెరపై చూస్తారని స్పష్టం చేశారు. అయితే ఇది పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని, 2027 లేదా 2028లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దర్శకుడు జీతూ మాధవన్.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే ఫహద్-జీతూ కాంబోలో ‘ఆవేశం 2’ ప్రారంభం కానుంది. దీంతో పాటు మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి దిగ్గజాలతో కలిసి తాను ‘పేట్రియాట్’ అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్లు కూడా ఫహద్ వెల్లడించారు. రంగన్న మ్యానరిజమ్స్, ఆ వైట్ అండ్ వైట్ లుక్ మళ్ళీ రాబోతుండటంతో సోషల్ మీడియాలో మీమ్స్, పోస్టులతో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
Also Read
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
తాజావార్తలు
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!