Tata- JLR Luxury Electric SUV: టాటా- జెఎల్ఆర్ తొలి లగ్జరీ ఈవీ ఎస్‌యూవీ.. రూ.9,000 కోట్ల పెట్టుబడితో..
- భారత్‌లో పూర్తిస్థాయి తయారీ యూనిట్‌ను ప్రారంభించిన టాటా-జెఎల్ఆర్..
- రూ. 9000 వేల కోట్లతో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ల తయారీ ప్లాంట్..
- ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్/ డీజిల్ వాహనాలు కూడా తయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata- JLR Luxury Electric SUV: భారత్‌లో ప్రీమియం ఆటోమొబైల్ రంగంలో తొలిసారిగా టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) పూర్తిస్థాయి తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలో నిర్మించిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని రేపు (ఫిబ్రవరి 10) ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో భారత్‌లోనే తొలిసారిగా ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తిస్థాయిలో తయారు కానుంది. కాగా, ఈ ప్లాంట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించగా, టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సమక్షంలో తొలి వాహనాన్ని ప్లాంట్ నుంచి విడుదల చేశారు. దీంతో భారత్‌లో గ్లోబల్ ఆటోమొబైల్ హబ్‌గా తమిళనాడు ప్రాధాన్యం మరింత పెరిగిందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also: BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీలో సంచలనం!
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
అయితే, రూ.9,000 కోట్ల పెట్టుబడితో 470 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ తయారీ కేంద్రానికి సంవత్సరానికి 2.5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో నడిచే ఈ ప్లాంట్‌లో ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా తయారు చేయనున్నారు. ఇందులో ప్రీమియం జాగ్వార్ ల్యాండ్ రోవర్ మోడళ్లతో పాటు టాటా మోటార్స్‌కు చెందిన కొన్ని ప్యాసింజర్ వాహనాలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఉత్పత్తి కానున్నాయి.
Read Also: Venky – Anil 4 : వెంకీ మామ.. అనిల్ రావిపూడి.. షూటింగ్ ఎప్పుడంటే
ఇక, ఇప్పటికే పుణేలో ఉన్న జేఎల్‌ఆర్ యూనిట్ ప్రధానంగా అసెంబ్లీ కేంద్రంగా ఉండగా, రాణిపేట ప్లాంట్ పూర్తిస్థాయి తయారీ కేంద్రం కావడం విశేషం. భారత్‌లో తొలిసారిగా ఒక ప్రీమియం కార్ పూర్తిగా దేశీయ ఫ్యాక్టరీలో తయారవడం ఇదే మొదటిసారి. చెన్నై- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్లాంట్‌కు బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే, సేలం- చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా బలమైన మల్టీ మోడల్ కనెక్టివిటీ ఉంది. ఎణ్నోర్, కాటుపల్లి, చెన్నై పోర్టులకు సమీపంలో ఉండటం ఎగుమతులకు అనుకూలంగా మారనుంది. ‘డెట్రాయిట్ ఆఫ్ ఏషియా’గా పేరొందిన చెన్నై ఆటోమొబైల్ ఎకోసిస్టమ్‌ను రెండో స్థాయి పట్టణాలకు విస్తరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
Read Also: Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు వైన్స్ బంద్!
కాగా, యూరప్‌తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు, అమెరికాతో టారిఫ్ ఒప్పందాల నేపథ్యంలో భారత్ గ్లోబల్ ట్రేడ్‌లో కీలక పాత్ర పోషించనున్న సమయంలో ఈ పెట్టుబడి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, భారత్‌లో ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న సంపన్న వర్గం, లగ్జరీ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగానే ఇండియా జేఎల్‌ఆర్‌కు కీలక మార్కెట్‌గా మారిందని కంపెనీ పేర్కొంది. 2011 నుంచే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జేఎల్‌ఆర్, గత మూడు సంవత్సరాల్లో తన వ్యాపారాన్ని మూడింతలు పెంచుకుంది. వచ్చే మరో మూడేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక, FY24లో భారత్ నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం సాధించిన జేఎల్‌ఆర్, 4,500 యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. FY25 తొలి త్రైమాసికంలో 31 శాతం వృద్ధితో.. దేశంలో లగ్జరీ కార్ల ప్రవేశం ప్రస్తుతం మొత్తం ప్యాసింజర్ వాహన మార్కెట్‌లో కేవలం 1 శాతంగా ఉండటంతో, లోకల్ గా తయారీ చేయడం ద్వారా ధరలు తగ్గించి, వేయిటింగ్ పీరియడ్‌ను తగ్గించి, మార్కెట్ షేర్‌ను పెంచుకోవచ్చని జాగ్వార్ కంపెనీ భావిస్తోంది. అయితే, రాణిపేట ప్లాంట్ టాటా మోటార్స్ గ్లోబల్ ఎలక్ట్రిక్, ప్రీమియం వాహన వ్యూహంలో కీలక పాత్ర పోషించనుంది. దీంతో పెట్టుబడులకు నమ్మకమైన గమ్యంగా తమిళనాడు స్థానం మరింత బలపడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!