Hyderabad: బాలుడి ప్రాణం తీసిన పతంగి.. మరో చిన్నారి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: సంక్రాంతి పండగ ముగిసింది. ఇంకా పతంగి ప్రాణాలు తీస్తూనే ఉంది. తాజాగా పతంగి వల్ల మరో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ బాలుడు భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్‌లో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన హేమంత్ (10) అనే బాలుడు సాయిబాబా నగర్‌లో బిల్డింగ్‌పైకి ఎక్కి గాలిపటం ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వెల్లడించారు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read
మరోవైపు.. పతంగి కోసం వెళ్లిన ఆరేళ్ల బాలుడు బాలుడు విద్యుత్ ఘాతానికి గురైన ఘటన కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లో చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ పై పడిన కైట్‌ను తీసుకునేందుకు వెళ్ళి ప్రమాదానికి గురయ్యాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు బయటకు వచ్చి చూశారు. కొద్ది దూరంలో బాలుడు ఎగిరిపడటాన్ని గమనించారు. వెంటనే ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలనీలో అత్యంత ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ ఉందని స్థానికులు చెబుతున్నారు.. కాలనీ వాసులు ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
READ MORE: Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు వైన్స్ బంద్!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!