* హైదరాబాద్: నేడు వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం.. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు.. అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష.. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను కోరిన సీఎస్
* హైదరాబాద్: నాంపల్లిలోని లలితా కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవం.. పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* నేడు సంగారెడ్డిలో మంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల పర్యటన.. వర్షానికి నీట మునిగిన రెవెన్యూ కాలని, శ్రీ చక్ర కాలని, మార్క్స్ నగర్, భగత్ సింగ్ నగర్ లో పర్యటించనున్న నేతలు
* భద్రాద్రి కొత్తగూడెం: కారకగూడెం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నేడు మావోయిస్టుల బంద్.. అలెర్ట్ అయిన పోలీసులు.. సరిహద్దులలో పెరిగిన కూంబింగ్
* మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటారు..
* ప్రకాశం : ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మీ కోసం కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.. జిల్లా ముఖ్య శాఖల అధికారులు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్ళటంతో కార్యక్రమాన్ని రద్దు చేసిన కలెక్టర్ తమీమా అన్సారియా..
* ప్రకాశం : దర్శికి చేరనున్న ఇండియన్ ఆర్మీ జవాన్లు జమ్ముకాశ్మీర్ నుండి అండమాన్ నికోబార్ వరకు చేస్తున్న సైకిల్ యాత్ర.. భోజనానంతరం తిరిగి కొనసాగనున్న యాత్ర..
* తిరుమల: ఇవాళ తిరుమలనంబి 1051వ అవతార దినోత్సవం
* శ్రీకాకుళం: హెవీ రెయిన్స్ నేపద్యంలో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం. కలక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్లాటు.. ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్స్ నియామకం. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
* శ్రీకాకుళం: భారీ వర్షాల పై యంత్రాంగం అప్రమత్తం.. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 08942-240557 కంట్రోల్ రూమ్ ఏర్పాటు .
* విశాఖ: భారీ వర్షాలతో ఉమ్మడి విశాఖ జిల్లాలో విద్యాసంస్థలు మూసివేత.. సెలవు కారణంగా ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసిన ఆంధ్రా యూనివర్శిటీ.
* నేడు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నిమిత్తం రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు రాక.. రోడ్డు మార్గం ద్వారా కాకినాడ కలెక్టరేట్ కు చేరుకోనున్న పవన్..
* నేను కాకినాడ కలెక్టర్ లో ఏలేరు ప్రాజెక్టు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వరద నీటిని దిగువకు విడుదలను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్న పవన్.. పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాల పై రివ్యూ
* అనంతపురం : తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్ద వడుగూరు మండలాలలోని గ్రామాలలో నేడు వినాయక నిమజ్జనం.
* అనంతపురం : గుంతకల్లు, గుత్తి, పామిడి మండల కేంద్రాలలో నేడు వినాయక నిమజ్జనం.
* అల్లూరి సీతారామ రాజు జిల్లా: భారీ వర్షాలు కారణం గా ఘాట్ రోడ్ లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు… అరకు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిపివేత. ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతం మూసివేత.. భారీ వర్షాలతో చాపరాయి జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వరద ప్రభావం తగ్గేంతవరకు చాపరాయి జలపాతం మూసివేసిన అధికారులు.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు జిల్లాలో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ రద్దు.. వర్షాలు కారణంగా గ్రీవెన్స్ రద్దు చేసిన కలెక్టర్ ప్రశాంతి
* విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఈరోజూ భారీ వర్ష సూచన.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి కి పూరీ-దిఘా మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం
* ఏలూరు: జిల్లా లో ఒక మోస్తారుగా కురుస్తున్న వర్షం.. ఎల్లో అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. నేడు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
* వాయువ్య బంగాళా ఖాతంలో ఓడిశా తీరంలో తీవ్ర వాయుగుండం… వాయువ్య దిశగా పయనిస్తు మరికొద్ది గంటల్లో పూరీ సమీపంలో తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం..
* ఏపీ, తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు. కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం….
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వల్లభ గణపతి సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ మహాగణపతి కల్యాణోత్సవం
* శ్రీ సత్యసాయి : హిందూపురం, పరిగి మండలాల్లో నేడు వినాయక నిమజ్జన కార్యక్రమం.
* విజయవాడ: ప్రకాశం బ్యారేజి ని బోట్లు ఢీకొనడంతో దెబ్బతిన్న 67, 69, 70 గేట్లు.. ఇప్పటికే సిద్ధమైన 67, 69 గేట్ల కౌంటర్ వెయిట్లు.. ఇవాళ ఉదయంతో పూర్తి కానున్న కాంక్రీట్ ఫిల్లింగ్.. ఇవాళ 70వ గేటు కౌంటర్ వెయిట్ ను అమర్చనున్న ఇంజనీర్లు.. ఇవాళ రాత్రికి పూర్తిగా మూడు కొత్త కౌంటర్ వెయిట్లు పూర్తయ్యే అవకాశం
* గుంటూరు: నేడు తెనాలి లో వరద బాధితులకు, జనసేన పార్టీ తరఫున చెక్కుల పంపిణీలు చేయనున్న పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్.. కొల్లూరు ,భట్టిప్రోలు, రేపల్లె ,తెనాలి మండలాలకు చెందిన బాధితులకు, తెనాలిలో చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి మనోహర్…
* గుంటూరు: నేడు దుగ్గిరాల మండల పరిషత్ ను కైవసం చేసుకోనున్న టిడిపి .. మండల పరిషత్, సర్వసభ్య సమావేశం లో చిలువూరు గ్రామానికి చెందిన జబీన్ ను ఎంపీపీగా ఎన్నుకోనున్న ఎంపీటీసీ సభ్యులు…
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,178 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,643 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు
* అల్లూరి జిల్లా: ఏజెన్సీలో జలపాతాలు దగ్గర పెరిగిన ప్రవాహ ఉధృతి.. జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలను మూసి వేసిన నిర్వాహకులు…
* విజయవాడలో పర్యటిస్తున్న జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్య కుమార్ యాదవ్, సవితమ్మ
* నంద్యాల: నేడు శ్రీశైలంలో సోమవారం వారాంతపు సేవలలో భాగంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయంలో వెండి రథోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ
* నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. జలాశయం 7 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత.. ఇన్ ఫ్లో 2,04,322 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2,58,292 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* నేడు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో విద్యాసంస్థలకు సెలవు..
* నేడు పార్టీ పిరాయించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పై హైకోర్టు లో తీర్పు..
* హైదరాబాద్: తెలంగాణ పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం.. ఇవాళ, రేపు రాష్ట్రంలో పర్యటించేందుకు హైదరాబాద్ చేరుకున్న సంఘం చైర్మన్ అర్వింద్ పణగారియా, సభ్యులు.. రేపు ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి, ఆర్దిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో భేటీ