ఇసుక సరఫరా, నూతన ఉచిత ఇసుక విధానంపై అధికారులతో బుధవారం రోజు సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక బుకింగ్ విధానం, రవాణా, సులభమైన లావాదేవీలు, విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం లాంటి అంశాల పై సమీక్ష చేసిన సీఎం.. వెబ్ సైట్, యాప్ లేదా గ్రామ వార్డు సచివాలయం నుంచి సులువుగా ఇసుక బుకింగ్ కు అవకాశం కల్పించాలని ఆదేశించారు.
తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. 18వ తేదీన కళ్యాణోత్సవ సేవ కూడా రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, తిరుమలలో పవిత్రోత్సవాలకు బుధవారం రోజు అంకురార్పణ జరిగింది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి.. ఇక, తొలి విడతలో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు.
వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్లో ఉంటూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మహేశ్వర్ రెడ్డి(48), ప్రశాంతి(35) అనే దంపతులు అప్పుల బాధ తాళలేక పురుగు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుమారు రూ.2.5 కోట్లు దాకా అప్పు చేశారు. సదరు దంపతులకు నిఖిల్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం అవుతుందని చూపించేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత. కర్నూలులో టీడీపీ నేత హత్య కేసులో నిందితులు ఎంతటి వారైన కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ.. మరోవైపు అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారని ఆరోపించారు.. సెబీ అనేది ఒక పవర్ ఫుల్ సంస్ధ.. అలాంటి సంస్థ కూడా అదానీకి కొమ్ముకాయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.