Prakasam barrage: ప్రకాశం బ్యారేజీపై కౌంటర్ వెయిట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.. హైదరాబాద్ నుంచి తెప్పించిన కౌంటర్ వెయిట్ లు ప్రకాశం బ్యారేజీ 67 ,69 గేట్లకు బిగిస్తున్నారు… గడిచిన వారం రోజులుగా వరదల నేపథ్యంలో, ఇసుకతో నిండిన పడవలు ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టడం, బ్యారేజీకి సంబంధించిన కౌంటర్ వెయిట్ లు దెబ్బ తినటం, వంటి అంశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.. ఒక్కొక్క కౌంటర్ వెయిట్ 17 టన్నుల బరువు ఉండే రెండు పిల్లర్‌లను వారం రోజుల్లో తయారు చేపించి ప్రకాశం బ్యారేజీకి తెప్పించారు.. నిన్న, నేడు కౌంటర్ వెయిట్ నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి..
Read Also: Karnataka : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ, చిన్నారులతో సహా ఐదుగురు మృతి
ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ ల స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్ లు ను బిగిస్తున్నారు నిపుణులు.. మొత్తం 35 మంది కార్మికులు మూడు షిఫ్ట్ లుగా రేయింబవుళ్లు పనిచేసి, బ్యారేజీ గేట్లకు కౌంటర్ వెయిట్ లను అనుసంధానం చేస్తున్నారు.. బరువుగా ఉన్న బోట్లు వచ్చి, ఢీకొనడంతో కౌంటర్ వెయిట్‌లు దెబ్బ తినటం జరిగిందని.. దీనికి తోడు కృష్ణ పరివాహక ప్రాంతంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో, ప్రాజెక్టుకు జరగబోయే నష్టాన్ని గమనించిన ప్రభుత్వం..యుద్ధ ప్రాతిపదికన కౌంటర్ వెయిట్‌లను అత్యంత వేగంగా తయారు చేపించింది.. వాటిని ప్రకాశం బ్యారేజీ వద్దకు తీసుకువచ్చి అమర్చే పనిలో పడ్డారు నిపుణులు.. బ్యారేజీ నిర్మాణ పనుల వ్యవహారాల్లో, నిష్ణాతులైన కార్మికులను, ఇంజనీర్లను రప్పించి, వాటిని బిగిస్తున్నారు.. నేడు కౌంటర్ వెయిట్‌లు బిగించడం పూర్తి అయిన నేపథ్యంలో, రేపు నిపుణుల పర్యవేక్షణలో వాటిని పరిశీలిస్తారు… గేట్లు ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, వంటి అంశాలలో కౌంటర్ వెయిట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.. అలాంటి పిల్లర్ లను సమర్థవంతంగా పరీక్ష చేసిన, తర్వాత ప్రాజెక్ట్ గేట్లకు అనుసంధానం చేస్తారు.. 67, 69 గేట్ల సామర్థ్య పరీక్షలు పూర్తయిన తర్వాత ,70 గేటు నిర్మాణ సామర్థ్యంపై కూడా పరీక్షలు జరుపనున్నారు నిపుణులు.. మొత్తంగా రేపు కూడా ప్రకాశం బ్యారేజ్ పై నిపుణుల పర్యవేక్షణలో ప్రకాశం బ్యారేజ్ గేట్ల కొద్దిగా పనులు జరగనున్నాయి.