భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. వచ్చేనెల 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నం గ్రామానికి రానున్నారు.. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టం అన్నారు.. విశాఖపట్నం రాజధాని పేరు చెప్పి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు.. తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
తల్లితో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. చిన్నారి అని కూడా చూడకుండా అఘాయిత్యానికి ఒడిగట్టాడు.. ఏడాది కాలంగా ఆ చిన్నారిపై అత్యాచారం చేస్తూ.. నరకం చూపించాడు.. అంతే కాదు.. అభం శుభం తెలియని చిన్నారిపై తన ప్రియుడు అత్యాచారం చేయడానికి.. ఆ పాప తల్లి సహకరించడం కలకలం రేపుతోంది..
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయ్యింది.. ఫుట్ పాత్‌పై అందరిలాగే సదరు మహిళ నడుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగిపోయింది.. దీంతో.. ఆమె మురికికాలువలో పడి గల్లంతైంది.
నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ ఉత్తర్వుల కాపీని ఈరోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయనను విడుదల చేశారు.