వైసీపీకి బిగ్ షాక్ తప్పదనే ప్రచారం జోరుగా సాగుతోంది.. వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట ఆ పార్టీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ.. దీనిపై రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై కీలక చర్చలు జరిగాయి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులంతా హాజరైన కేబినెట్ సమావేశంలో.. పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది.. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది..
కడపలో చెత్త వివాదం కాస్తా.. కడప మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల నమోదు వరకు వెళ్లింది.. చెత్త వివాదం ఘటనలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెయిల్ మీద విడుదలైన కవిత.. శశికళలా ఆవేశపడి బీజేపీ పెద్దలపై స్టేట్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటే.. ఏ కేసీఆర్నో.. ఏ కేటీఆర్నో అరెస్ట్ చేసేవాళ్లమన్న ఆయన.. కానీ, కవిత చేసిన చెడుసావాసాల వల్లే ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు.. వాస్తవాలు తెలుసుకోకుండా శశికళల ఆవేశపడి పనికిరాని స్టేట్మెంట్లు ఇస్తే ఆమెకే నష్టమన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనే వార్తలు హాస్యాస్పదంగా ఉందన్నారు.. విలీనమే అంటే ఇంత…
అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని మద్దికేర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ప్రేమజంట రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది.. మృతులు.. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె మీనా, కులదీప్ పరియార్ లు గా గుర్తించారు రైల్వే పోలీసులు..
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.. దీంతో.. ఈ సంవత్సరంలో రెండోవసారి రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు.. శ్రీశైలం జలాశయంలోని రెండు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు.
కేబినెట్ భేటీ తర్వాత కీలక శాఖలపై దృష్టి సారించనున్నారు సీఎం చంద్రబాబు.. సెర్ప్, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖపై దృష్టిపెట్టనున్నారు.. సెర్ప్, MSME శాఖలపై సమీక్షించనున్నారు చంద్రబాబు. MSME కొత్త పాలసీ, MSME పార్కుల ఏర్పాటుపై చర్చించనున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో భూ ప్రకంపనలు.. ప్రజలను భయాందోళనకు గురిచేశాయి.. జిల్లాలోని ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది.. తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకోగా.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రజలు.. భయాందోళనకు లోనయ్యారు.. మరోసారి ఉదయం 4:03 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి..