* హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ. హైడ్రాకి చట్ట బద్దత ద్వారా ఆర్డినెన్సు తీసుకురావడం?, మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారు చేయడం, భారీ వర్షాలు- వరదల కారణంగా జరిగిన నష్టం, రేషన్ కార్డులు జారీ, హెల్త్ కార్డులు మంజూరు?, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, త్రిబుల్ ఆర్ భూసేకరణ తదితర అంశాలపై చర్చ
* హైదరాబాద్: నేటి నుంచి మళ్లీ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ.. నేడు విచారణ కమిషన్ ముందుకు రానున్న ఏడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు.. కమిషన్ బహిరంగ విచారణకు రానున్న రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు
* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు.. కేసు విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ల ధర్మాసనం
* హైదరాబాద్: నేడు సెక్రటేరియట్ లో ఉదయం 11:30 గంటలకు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
* ప్రకాశం : ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఆకస్మికంగా సీఎం జిల్లా పర్యటన ఖరారు.. నాగులప్పలపాడు మండలం మద్దిరాలపాడులో సీఎం చంద్రబాబు పర్యటన.. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
* అమరావతి: ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశం.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంచార్జులను మార్పులు చేయవచ్చని అంచనా.. మాజీమంత్రి బాలినేని పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టిన పార్టీ అధినేత జగన్..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేజర్ల మండలంలో జరిగే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు
* రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. డాక్టర్ పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నేడు ఉదయం 11:00 గంటలకు విజయవాడలో హోటల్ నొవోటల్ నందు ఆంధ్రప్రదేశ్-వియత్నం టూరిజం ఎన్‌క్లేవ్ 2024 కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. మధ్యాహ్నం 03:00 గంటలకు టూరిజం డిపార్ట్మెంటల్ రివ్యూ మీటింగ్ కార్యక్రమం
* నంద్యాల: మహానంది క్షేత్రములో నేడు కామేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు , సాయంత్రం పల్లకి సేవ
* ఎన్టీఆర్ జిల్లా: నేడు కార్యకర్తలతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమావేశం.. నేడు వైసీపీ కి రాజీనామా చేయనున్న ఉదయభాను.. పార్టీ కార్యకర్తల సమావేశంలో రాజీనామా నిర్ణయం ప్రకటన చేయనున్న ఉదయభాను.. ఈ నెల 22న జనసేన పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటన..
* చిత్తూరు: పూతలపట్టు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటన.. యువగళం పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ప్రారంభించనున్న నారా లోకేష్.. మధ్యాహ్నం బంగారు పాళ్యంలో ఏర్పాటు చేసినా ప్రజావేదిక కార్యక్రమానికి హాజరు.
* అనంతపురం : నేటి నుంచి జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు.
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్…
* అన్నమయ్య జిల్లా : నేడు రాయచోటికి రానున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. నేటి నుంచి 6 రోజుల పాటు రాయచోటి నియోజకవర్గంలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి….
* తిరుమల: రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల
* ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నేడు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం, పాల్గొననున్న స్థానిక ఎమ్మెల్యేలు.
* గుంటూరు: రేపు తెనాలి మార్కెట్ యార్డ్ ఆవరణలో ఎమ్మార్పీఎస్ ఆత్మీయ సమ్మేళనం, హాజరుకానున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ…
* బాపట్ల: నేడు రేపల్లె లో అనగానే భగవంతుడు ప్రభుత్వ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా…
* పల్నాడు: నేడు వినుకొండలో మండల స్థాయి క్రీడా పోటీలు…
* శ్రీ సత్యసాయి : రొద్ధం మండలం కోగిర గ్రామంలో మా మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,835 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,883 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.96 కోట్లు
* అనంతపురం : సీపీఎం ఆధ్వర్యంలో లలితాకళాపరిషత్ లో సీతారాం ఏచూరి సంతాపసభ.