చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు.. తీవ్రగాయాలపాలైన కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషాతో పాటు ఆయన భార్య షాహినా ప్రాణాలు విడిచారు..
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) లో ఉండే బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నగరంలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది.
నవంబర్ కోటాకు సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేస్తూ.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త చెబుతూ వస్తున్న టీటీడీ.. ఈ రోజు ఆన్లైన్లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల చేయబోతోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు.
నిరంతరం హరే కృష్ణ నామం గొప్పతనాన్ని ప్రపంచానికి ఓ మహా వైదాంతిక భక్తి సంస్థ ఇస్కాన్.. అసలు ఇస్కాన్ అంటే హరే కృష్ణ ఉద్యమం అని పిలవబడే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్.. అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..?
శ్రీవారి మెట్టు మార్గంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది.. ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యయత్నం చేయడంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.. పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ.. ఓ యువకుడి ప్రేమలో పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాలకు ఉన్న పేర్లను మారుస్తూ వస్తోంది.. ఇప్పటికే పలు పథకాల పేర్లు మారిపోగా.. తాజాగా.. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖలో అమలు చేస్తున్న ఆరు పథకాల పేర్లలో మార్పులు.. చేర్పులు చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.