CPM Srinivasa Rao: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఓవైపు ప్రైవేటీకరణకు అవకాశం లేదని చెబుతున్నా.. మరోవైపు ఆ దిశగా అడుగు పడుతున్నాయే విమర్శలు ఉన్నాయి.. అయితే, స్టీల్ ప్లాంట్‌ను ఏదోరకంగా మూసేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. కూటమి సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరించను అని చెప్తున్నాడు.. కానీ, ఇది మాటలకే పరిమితం, తప్ప చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్లు GST చెల్లిస్తోంది.. ఇప్పుడు షరతులతో కూడి 500 కోట్లు ఇస్తామని చెప్పడం తెలుగు ప్రజలును అవమానించడమే అని దుయ్యబట్టారు..
Read Also: IND vs BAN Test: ముగిసిన భారత్ మొదటి ఇన్నింగ్స్.. 376 ఆలౌట్..
ఇక, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు.. స్టీల్ ప్లాంట్ ను కాపాడకపోతే రాజీనామా చేస్తాను ప్రకటించాడు.. ఆహ్వానిస్తున్నాం.. కానీ, రిజల్ట్ కావాలి అన్నారు వి. శ్రీనివాసరావు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్ చేపట్టాలి.. సీఎం బాధ్యత వహించి సీఎం ఆధ్వర్యంలో ఈ మిషన్ పనిచేయాలి.. సంవత్సరంలోపు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లో నడపడానికి సీఎం చొరవ తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాలు కొంతమంది అమ్ముడుపోయారని కామెంట్ చేస్తున్నవాళ్లే అమ్ముడుపోయి ఉంటారు.. కార్మికుల అమ్ముడుపోయారు అనే ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు.. మరోవైపు.. జమిలి ఎన్నికలపై స్పందిస్తూ.. జమిలి ఎన్నికలు పెడితే ఇంకా సూపర్ పవర్ అయిపోతాను అని మోడీ భావిస్తున్నారని సెటైర్లు వేశారు.. ఇక, వంద రోజుల ప్రభుత్వ పాలనను మంచి పాలనని చెప్పుకుంటున్నారు.. తప్ప అందులో ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..