శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.. దీంతో.. మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.. కాసేపట్లో రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు.. అయితే, ఇన్ ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్లో వచ్చి చేరుతుంది..
సచివాలయంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. అయితే, ఏపీ సర్కార్ మరోసారి పేపర్ లెస్ విధానాన్ని అవలంభిస్తోంది.. ఈ-కేబినెట్ భేటీని నిర్వహించనుంది. 2014-19 మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం ఈ-కేబినెట్ నిర్వహించింది. తిరిగి మళ్లీ ఇవాళ్టి నుంచి ఈ-కేబినెట్ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి గెలుపు షాక్ ఇచ్చింది.. మొదట నమ్మలేకపోయాం అన్నారు. అయతే ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగ్పై అనుమానాలు వ్యక్తం చేసింది. భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్న ఆయన.. ఎన్నికలయ్యాక ఏపీలో 68.12 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఈసీ చెప్పింది అన్నారు అంబటి రాంబాబు
ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ఆక్రమణకు గురైన భూములను స్వచ్చందంగా స్వాధీనం చెయ్యాలన్నారు.. లేదంటే ప్రభుత్వం ఆ పని చేస్తుందని స్పష్టం చేశారు.
కడపలో చెత్త వివాదం తారస్థాయికి చేరుకుంది.. గత రెండు రోజులుగా కడప ఎమ్మెల్యే మాధవి, కడప మేయర్ సురేష్ బాబుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం.. నేడు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమ వీధులలో చెత్త ఎత్తలేదు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెత్తను తీసుకుని వచ్చి మేయర్ ఇంటి వద్ద వేసి నిరసనకు దిగారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. తన అనుచరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. నియోజకవర్గంలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారు.. వారు వెంటనే పద్దతి మార్చుకోవాలి.. ఇసుక తరలింపు నిలిపివేయాలని స్పష్టం చేశారు. గతంలో ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని గుర్తుచేసుకున్న ఆయన.. నా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు..
ఏలూరు నగర మున్సిపల్ కార్పొరే షన్ మేయర్ షేక్ నూర్జహాన్.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె తన భర్త పెద బాబుతో కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.. నేడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు కూడా.. టీడీపీ గూటికి చేరనున్నారు.
రిటైరయ్యే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మళ్లీ వాళ్లు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించేందుకు విధివిధానాలు ఖరారు చేసింది. రిటైరైన ఉద్యగులను మిడిల్ లెవల్ ఆఫీసర్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా రీ అపాయింట్మెంట్ కోసం విధివిధానాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.