ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రభుత్వం తీరు బాధాకరం అన్నారు.. మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించ కూడదు అనే తాపత్రయం కనిపించిందని దుయ్యబట్టారు.
గుండెల నిండా కమిట్మెంట్తో పనిచేస్తాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మైసూర్వారి పల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు.. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం.. గత ప్రభుత్వ హయాంలో సంయుక్త.. మైసూర్ వారి పల్లి సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డా... గ్రామస్థాయి నుంచి దేశభక్తి రావాలి అని పిలుపునిచ్చారు..
రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనరంలో విస్తృత పర్యటన అనంతరం చర్యలు మొదలయ్యాయి. శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ ని సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట.. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
అనకాపల్లి నుంచి అనందపురం వరకు ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను ప్రయోగత్మకంగా ప్రారంభించేందుకు పోలీస్ యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆటో నంబరు ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను సిగ్నలింగ్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేస్తారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. టెక్కలి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరాడ తిలక్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీచేసింది.
అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మా సెజ్‌లోని మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇన్ గ్రేడియంట్స్ సంస్ధలో అర్థరాత్రి 1 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు అయినట్టుగా చెబుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు.. అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని పరామర్శించనున్నారు మాజీ సీఎం.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గాన అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పనున్నారు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు.. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు 13 వేల 326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించబోతోంది ఏపీ సర్కార్. ఉపాధి హామీ పధకంలో ప్రతి కుటుంబానికీ సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా.. ఒకే రోజున నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4 వేల 500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకోనున్నారు. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామసభలో…