Narayana Swamy: మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఓడిపోయిన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి కుట్రలు చేయకండి, వైఎస్ జగన్ కు వెన్నుపోటు పొడవకండి అని సూచించారు.. చాలామంది మాజీ వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వ్యాపారాలు చేయాలని చూస్తున్నారు అని విమర్శించారు.. ఇక, ప్రతిరోజు జగన్ ను బాధపెట్టే పనులు చేయకండి.. వెళ్లిపోయేవాళ్లు అందరూ ఇప్పుడే వెళ్లిపోండి అని సలహా ఇచ్చారు.. పార్టీ నుండి ఎంత పెద్దవాళ్లు వెళ్లిపోయినా.. పార్టీకి ఎలాంటి నష్టం లేదు.. 40 శాతం ఓటర్లు జగన్‌కు ఉన్నారని వెల్లడించారు.. వెళ్లిపోయిన వారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి జగన్ చేర్చుకోకూడదన్నారు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా 175కి 175 స్థానాలు గెలిచే సత్తా వైఎస్ జగన్‌కు ఉందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. 100 సీట్లు అభ్యర్థులను మార్చి ఓడిపోయామని పేర్కొన్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.
జంతువుల కొవ్వును లడ్డూలో వాడి ఉంటే అలా వాడిన వారి కాళ్లు చేతులు, నోరు పడిపోతాయి.. అదే అబద్ధమైతే చంద్రబాబుకు అదే గతి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు నారాయణస్వామి.. వేంకటేశ్వర స్వామి వారి అలాంటివారిని శిక్షిస్తారు.. నేను చేసింది తప్పని చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో గెలిచి ఉంటే స్వామీ వారి లడ్డూపై చంద్రబాబు అలా మాట్లాడి ఉండడు.. ఈవీఎం ద్వారా గెలిచాడు కాబట్టే ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు.. మనిషిగా పుట్టిన వాడు ఎవడు ఇలా మాట్లాడడు. వయసు ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడు.. జగన్ పై బురద చల్లడమైన లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నాడు.. స్వామివారి లడ్డూ గురించి తప్పుగా ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి..