రాజోలు నియోజకవర్గంలో ఘర్షణ చోటు చేసుకుంది.. మల్కీపురం మండలం అడవిపాలెం గ్రామంలో ప్రభుత్వ భూమి విషయంలో గ్రామ సర్పంచ్, ఆమె భర్త, వార్డు మెంబర్లపై దాడి జరిగింది.. 2021లో నూతనంగా ఏర్పడింది అడవిపాలెం పంచాయతీ.. అయితే, నూతన పంచాయతీకి భవనం లేకపోవడంతో 1 ఎకరం 96 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు భూమిని సర్వే చేస్తున్న సమయంలో రగడ మొదలైంది.. కొంత మంది దళితులు 1 ఎకరం 96 సెంట్లు భూమిని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి
తిరుపతి రైల్వే స్టేషన్‌లోని లిఫ్ట్ లో ఇరుక్కున్నారు దంపతులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న సాయిబాబు దంపతులు.. మొదటి గేట్ వద్ద లిఫ్ట్ లో నుండి కిందకు దిగుతుండగా లిఫ్ట్ ఆగిపోయింది.. దాదాపు 2 గంటల పాటు లిఫ్ట్‌లో తీవ్ర ఇబ్బంది పడ్డారు.. అయితే, టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేపట్టడంతో కిందకు దిగింది లిఫ్ట్.
పాపికొండల పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. దీంతో.. నాలుగు నెలల తర్వాత పాపికొండల పర్యటన తిరిగి ప్రారంభం కానుంది.. పాపికొండల పర్యటనలు పునః ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఎస్డీఆర్ఎఫ్ టీంతో మాక్ డ్రిల్ నిర్వహించారు.. ఈ సందర్భంగా రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ.. పాపికొండల పర్యటనలు శనివారం నుండి మొదలుకానున్నాయని.. అందులో భాగంగానే పాపికొండల బోట్లను తనిఖీ చేసిన అనంతరం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
శ్రీవారి నడకదారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచనలు చేసింది.. ఇటీవలికాలంలో తిరుమలకు కాలి నడకన వస్తున్న భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు సూచనలు చేస్తోంది..
కర్నూలు జిల్లా పత్తికొండలో అన్ని ఏర్పాట్లు చేశారు.. సగం కార్యక్రమాలు పూర్తి చేశారు.. కానీ, పెళ్లి సమయానికి పెళ్లి కూతురు వెళ్లిపోవడంతో.. ఆ మ్యారేజ్ పీఠలపైనే నిలిచిపోయినట్టు అయ్యింది..
విజయవాడ వరద బాధితిలకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే వరద బాధితులకు పరిహానం ప్రకటించిన ప్రభుత్వం.. ఈ రోజు మరో 1,501 మంది బాధితుల కోసం రూ.2.5 కోట్లు పరిహారం విడుదల చేసింది.. 1,501 మంది బాధితులకు వారి అకౌంట్లకు నేడు నగదు బదిలీ చేసింది..