Train Accident: పల్నాడు జిల్లాలో తృటిలో రైలు ప్రమాదం తప్పింది.. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం రైల్వే గేటు వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు… నడికుడి నుండి పొందుగుల మధ్యలో ఈ ఘటన జరిగింది.. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని విష్ణుపురం రాశి సిమెంట్ ఫ్యాక్టరీలోకి సిమెంట్ లోడింగ్ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు.. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైలు గేటు వద్ద కొద్దిసేపు వాహనాలు నిలిచిపోయాయి.. ఇక, సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు, అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు.. ఈ ఘటనతో రైళ్లను దారి మళ్లించారు.. గుంటూరు- హైదరాబాద్ మధ్య నడవాల్సిన రైళ్లను విజయవాడ మీదుగా దారి మళ్లించినట్టు వెల్లడించారు రైల్వే అధికారులు..
Read Also: Daaku Maharaaj : దబిడి దిబిడి నెగిటివ్ కామెంట్స్ పై స్పందించిన నాగవంశీ