డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.. ఏదైనా ఇష్యూ జరిగితే డైవర్షన్ ఎలా చేయాలో చూస్తున్నారు తప్పా పని చేయరు అని దుయ్యబట్టారు.. ప్రతి ఇంట్లో ఉన్న గొడవలే మా ఇంటిలో కూడా ఉన్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్.. కానీ, నేను గుర్ల వస్తున్నానని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంత చేశారు.. నా ఫోటో.. నా చెల్లి ఫోటో.. మా అమ్మ ఫోటో పెడతారు.. మీ ఇళ్లలో ఇలాంటి సమస్యలులేవా? అని నిలదీశారు.
ప్రాజెక్టులవారీగా నేషనల్ హైవే పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర, నేషనల్ హైవే అధికారులు, పనులు చేస్తున్న ఆయా ఏజెన్సీల ప్రతినిధులు హాజరుకాగా.. చేపట్టిన పనులు.. చేపట్టాల్సిన పనులు.. వివిధ దశల్లో ఉన్న జాతీయ రహదారుల పనుల పురోభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష చేశారు.
విజయనగరం జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై హాట్ కామెంట్లు చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలను.. డయేరియాతో ఆస్పత్రిపాలైనవారిని పరామర్శించిన ఆయన.. ఈ సందర్భంగా డయేరియా మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు.. కూటమి హయాంలో గ్రామ స్వరాజ్యం అస్తవ్యస్తం అయ్యింది.. 14 మంది డయేరియాతో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు..
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది.. దీంతో.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి.. ఇప్పటికే శ్రీశైలం జలాశయం గేట్లు ఐదు సార్లు ఎత్తి.. దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేసిన అధికారులు.. మరోసారి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తారు.
దానా తూఫాన్ తీవ్ర రూపం దాల్చింది.. తీవ్ర తూఫాన్ గా మారి ముంచుకొస్తుంది.. రేపు వేకువజామున తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముంచుకొస్తున్న తీవ్ర తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది..
అల్లికల కళలో ఏపీకి చెందిన స్వాప్నికకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక.. తన అమ్మమ్మ వద్ద అల్లికలను నేర్చుకొని వాటికి సంబంధించిన మెళకువలను అవలీలగా పసిగట్టి కొత్త అల్లికల గురించి ఆలోచించేది, వాటికి సంబంధించిన కొత్త రికార్డు గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం.
కాకినాడ జిల్లా ఏవీ నగరంలో ప్రియుడుతో కలిసి భర్త మధుకి విషంపెట్టి చంపింది భార్య.. స్థానికంగా ఉన్న రిఫరల్ హాస్పిటల్లో పనిచేసే మృతుడి భార్యకి.. అక్కడే పనిచేసే ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా హద్దులు దాటేసింది.. వివాహేతర సంబంధానికి దారితీసింది.. ఈ విషయం కాస్తా భర్త మధుకు తెలియడంతో.. ఆ కుటుంబంలో గొడవలు మొదలైనట్టుగా తెలుస్తోంది..