ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.. ఈ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయబోతున్నారు.. ఈ పథకంలో అమలులో అర్హతలు.. దరఖాస్తు.. మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేయగా.. ఈ రోజు మరింత క్లారిటీ ఇచ్చారు మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్.. సూపర్ సిక్స్ లో ప్రధానమైనది ౩ ఉచిత సిలిండర్ల పథకాన్ని ఈ నెల 31న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తాం అన్నారు.. 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు…
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావనపై మున్సిపల్ మంత్రి నారాయణకి ఫిర్యాదు అందింది.. మంత్రి నారాయణకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే కొండ బాబు.. కమిషనర్ భావనపై ఫిర్యాదు చేశారు.. వివాదాస్పద స్థలం బయో మెథనేషన్ ప్లాంట్‌కి కేటాయించడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. గతంలో ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తక్కువ ధర భూమికి వందల కోట్లు టీడీఆర్ బాండ్లు కేటాయించారని ఆరోపణలు చేశారు కొండబాబు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి, చేసి చూపిస్తున్నాం అన్నారు.. 2,245 కోట్ల రూపాయలతో ఎర్రుబాలెం నుండి నంబూరు వరకు రైల్వే లైన్ రావడం సంతోషం అన్నారు..
సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో నిందితురాలు రెండో రోజు కస్టడీ కొనసాగుతుంది.. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో నిందితురాలు జాయ్ జెమీమాను విచారిస్తున్నారు పోలీసులు... అయితే, కిలాడీ లేడీ పోలీసులు విచారణలో నోరు మెదపడం లేదట.. దీంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు.. జెమీమాకు సంబంధించి మరికొన్ని మొబైల్స్ గుర్తించారు పోలీసులు... అందులోనే అసలైన డేటా ఉన్నట్లు తెలుస్తోంది.. మరో వైపు జెమీమా పరిచయాలపై కూడా నిఘా పెట్టారు.
చిత్తూరు జిల్లా యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత మృతి కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు.. ఈ కేసులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక, వారి నుంచి చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు డీఎఫ్‌వో భరణి..
పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై నిరంతరం సమీక్షిస్తున్నారు మంత్రి నారాయణ.. పల్నాడు జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడారు మంత్రి.. అయితే, ప్రస్తుతం దాచేపల్లిలో డయేరియా అదుపులోనే ఉందని కలెక్టర్ వివరించారు.. కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు.. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యాధికారులు తెలియజేశారు..
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతుంది.. వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలోని కృష్ణాబేసిన్‌లోని అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు... జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది.. జూరాల పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే.. ప్రస్తుత…
"దానా" తీవ్ర తుఫాన్ తీరం దాటింది.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల మధ్య.. హబాలిఖాతి నేచర్ క్యాంప్(భిత్తర్కనిక) మరియు ధమ్రాకు సమీపంలో తీరం దాటేసింది తుఫాన్ దానా.. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2-3 గంటల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ రోజు మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు.. ఇదే సమయంలో.. ఉత్తరాంధ్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
టెంపుల్ సిటీ తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది.. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం ఈమెయిల్లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు.