ధరల నియంత్రణ, మార్కెట్ ఇంటర్వెన్షన్లపై మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో మంత్రుల కమిటీ వేశారు.. కమిటీలో సభ్యులుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు..
పార్టీ కోసం శ్రమించిన వారికే కీలక పదవులు వస్తాయని స్పష్టం చేశారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కడపలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోసమావేశమయ్యారు రెండు జిల్లాల ముఖ్య నాయకులు.. పార్టీ బలోపేతంపై చర్చించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించాం.. జిల్లా, మండల స్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని సిద్ధం చేస్తున్నాం.. నియోజకవర్గ సమన్వయకర్తలతో చర్చించి పార్టీ పోస్టుల్లో నియామకాలు చేస్తున్నాం అన్నారు..
అమెరికా పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్‌కు.. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.. ఇక, అక్కడ పారిశ్రామికవేత్తతో సమావేశం అయ్యారు లోకేష్.. వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు
టీడీపీ సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ ప్రారంభం అయ్యింది.. తొలి సభ్యత్వాన్ని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకోవడంతో.. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. అయితే, రూ.100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం కల్పించేలా సభ్యత్వ కార్యక్రమాన్ని రూపొందించింది తెలుగు దేశం పార్టీ.
కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. కన్పించకుండా పోయింది పెళ్లి కూతురు వైష్ణవి.. ఆమె ఓ యువకుడితో వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.. అయితే, ప్రియుడు విశ్వాస్ ని పెళ్లి చేసుకున్న వైష్ణవి.. ఇవాళ పత్తికొండ పీఎస్ లో ప్రత్యక్షమైంది..
గోదావరి వరదలు కారణంగా జులైలో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర.. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఏపీ టూరిజం శాఖకు చెందిన ఒక బోటు.. ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన మరో 14 బోట్లు అందుబాటులోకి వచ్చాయి.
టెంపుల్ సిటీ తిరుపతిలో వరుసగా బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి.. నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు తాజాగా బాంబు బెదిరింపులు వచ్చాయి.. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు.. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు..
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు అధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చూట్టారు. ఆధ్యాత్మిక యాత్ర బస్సును రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం రాజమండ్రి సరస్వతీ ఘాట్ వద్ద ఉన్న టూరిజం శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం వద్ద నుండి ఆధ్యాత్మిక యాత్ర బస్సు బయలుదేరింది.