HMPV Virus: HMPV వైరస్‌పై ఆందోళన అవసరం లేదు.. వైద్య నిపుణుల సూచన
- కొత్త వైరస్ పై వైద్య నిపుణుల కీలక సూచనలు..
- హెచ్ఎంపీవీ వైరస్ పై ఆందోళన అవసరం లేదని క్లారిటీ..
- రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెబుతున్న అధికారులు..
- ముందస్తు జాగ్రత్త చర్యలును తీసుకోవాలని సీఎం ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMPV Virus: హెచ్ఎంపీవీ వైరస్ పై ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు అంటున్నారు సీనియర్ వైద్య నిపుణులు.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెబుతున్నారు.. ఇక, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలును తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. అన్ని చర్యలు చేపట్టాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.. హెచ్ఎంపీవీ వైరస్ పై హెల్త్ డిపార్ట్మెంట్ కు దిశా నిర్దేశం చేశారు.. బెంగళూరు, గుజరాత్ ల్లో బయటపడ్డ వైరస్ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు పెట్టుకోవాలని సూచించారు.. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతపై సమీక్ష చేశారు.. HMPV అనేది సాధారణ కాలానుగుణ వ్యాధి, తేలికపాటి స్వభావం కలది.. ఈ వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదని.. 2001 నుండి HMPV ప్రబలంగా ఉన్నా, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు సీనియర్ వైద్య నిపుణులు.
కాగా, HMPV వైరస్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది.. సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.. టెలీ కాన్ఫెరెన్సు లో మాట్లాడారు.. కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపివి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు చంద్రబాబు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో హెచ్ఎంపీవీ కేసులు ఏవీ నమోదు కాలేదని ఆయన చెప్పారు. తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం మరియు ఐఎల్ఐ వంటి ఇన్‌ఫ్లూ కేసులలో కూడా ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదన్నారు. ఈ వైరస్ కు తేలికపాటి స్వభావం ఉన్నందున ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక ఇన్‌పుట్‌లను అందించడానికి మైక్రో బయాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, పల్మోనాలజిస్ట్ మరియు ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్‌లతో నిపుణుల కమిటీ (టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అంశంపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు అందచేస్తుందని ఆయన వివరించారు.
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ఇది ఒక నిర్దిష్ట కాలపు (సీజనల్) వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం సూచించారు… వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం, హెచ్ఎంపివి వైరస్‌ని పరీక్షించడానికి యూనిప్లెక్స్ కిట్‌లను సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో ఐసిఎంఆర్ గుర్తింపు పొందిన 10 వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఈ సౌకర్యాలలో హెచ్ఎంపివి పరీక్షలు చేయవచ్చని చెప్పారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) పూణేలో హెచ్‌ఎమ్‌పివి నిర్ధారణ పరీక్ష జరగాలని కేంద్రం సూచించిందన్నారు. ఐసిఎంఆర్ గుర్తింపు పొందిన విడిఆర్ఎల్ ల్యాబ్‌లకు అవసరమైన టెస్టింగ్ కిట్‌లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు. జర్మనీ నుండి మొదటగా 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. 4.50 లక్షల N95 మాస్క్‌లు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్క్‌లు, 3.52 లక్షల PPE కిట్లు తక్షణమే అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియచేశారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలకు సరఫరా చేయడానికి పై వాటిని మరియు శానిటైజర్ లు మరిన్ని స్టాక్‌లను రాబోయే మూడు నెలలకు సేకరించాలని సిఎం చంద్రబాబు సూచించారు. చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. హెచ్ఎంపివి సంబంధిత అనారోగ్యం చికిత్సకు అవసరమైన మందులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియచేశారు. అవసరమైతే, రిబావిరిన్ వంటి ప్రత్యేక మందులను ఎపిఎంఎస్ఐడిసి ద్వారా సరఫరా చేసే వరకు స్థానికంగానే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
అన్ని ప్రభుత్వ బోధన మరియు జిల్లా ఆసుపత్రులలో 20 పడకల ఐసోలేషన్ వార్డులను అవసరమైతే సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని ఓపి ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైపు లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా మరియు పిఎస్ఎ ప్లాంట్ల లభ్యత వంటి అంశాలపై అన్ని ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదయిన తీవ్రమైన అక్యూట్ రెవ్స్పిరేటరీ ఇన్ఫెక్షన్ మరియు ఇన్‌ఫెక్షన్ ఐఎల్ఐ వంటి ఇన్‌ఫ్లుఎంజా కేసులను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. తదుపరి నిర్వహణ కోసం ఏదైనా హాట్‌స్పాట్‌లను గుర్తించడంతో పాటు ప్రజలకు… సబ్బుతో 20 సెకన్ల పాటు హ్యాండ్ వాష్, మాస్క్ వాడకం, పరిశుభ్రత నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు. నమోదవుతున్న జ్వరబాధితులపై నిఘా ఉంచాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఏమీ లేదని సిఎం స్పష్టం చేశారు. అందువల్ల భయాందోళన అవసరం లేదని మరియు కేసుల పెరుగుదలతో ఎదురయ్యే పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ పూర్తిగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వైజాగ్ నుండి హెచ్ఎంపివి వ్యాప్తిపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు వివరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!