Clash in Cricket: గల్లీ నుంచి అంతర్జాతీయ వేదికల వరకు పలు సందర్భాల్లో ఆట ఆడుతుండగా ఘర్షణలు, దాడులు, ప్రతి దాడులు చోటు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఇక, గల్లీ క్రికెట్‌లో ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి.. తాజాగా, నందలూరు మండల కేంద్రంలో కిక్రెట్ ఆడుతుండగా.. యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. ఇది చిలికిచిలికి గాలివానగా మారిపోయింది.. ఈ ఘర్షణలో వికెట్లతో కరిముల్లా అనే యుకువకుడిపై దాడి చేశారు 11 మంది యువకులు.. అతడిని చితకబాదారు.. కరిముల్లాకు తీవ్ర గాయాలు కావడంతో.. 108 వాహనంలో కడప రిమ్స్ కి తరలించారు..
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కిక్రెట్ ఆట సందర్భంగా యువకుల మధ్య ఘర్షణ చోటు చేసు కుంది. ఈ ఘర్షణలో వికెట్లతో కరిముల్లా (35) అనే యువకుడిని 11 మంది యువకులు చితకబాదారు.. కరిముల్లాకు తీవ్ర గాయాలు కాగా, 108 వాహనంలో కడప రిమ్స్ కి తరలించారు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సదరు యువకుడు.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు.. రాజంపేట డీస్పీ సుధాకర్ సూచన మేరకు ఘర్షణ స్థలంలో తిరిగి శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. ఇక, దాడి చేసిన 11 మందిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్టు.. వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.. నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.