Buddha Venkanna: తెలుగుదేశం పార్టీకి దశ, దిశ నారా లోకేష్ మాత్రమే.. నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే సీఎం అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ కార్యలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. భారీ కేక్ కట్ చేశారు వెంకన్న, టీడీపీ కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తరువాత పార్టీకి దశ దిశ లోకేష్ మాత్రమే అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ లోకేష్ చేపట్టిన యువగళంకి వచ్చిందన్నారు.. ఇక, నారా లోకేష్ వారసత్వ రాజకీయ నాయకుడు కాదు.. లోకేష్ ప్రజల్లో నుంచి ఎదిగిన నాయకుడిగా పేర్కొన్నారు.. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, చంద్రబాబు తర్వాత లోకేష్ వారసుడు అని స్పష్టం చేశారు.. పార్టీ కష్ట కాలంలో వున్నప్పుడు లోకేష్ చేపట్టిన పాదయాత్రతో పార్టీ మళ్లీ గాడిలో పడిందన్నారు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న..
Read Also: Minister Nimmala Ramanaidu: 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి.. నిర్వాసితులకు న్యాయం చేస్తాం..
కాగా, నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రాండ్‌గా నిర్వహించారు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. మరోవైపు.. ఈ మధ్యే నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి వినిపించగా.. అది కాస్తా.. జనసేన-టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్‌కు తెరతేసింది.. దీంతో అప్రమ్తమైన రెండు పార్టీలు.. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ.. ఎలాంటి వేదికలపై.. ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని.. అటు టీడీపీ అధిష్టానం.. ఇటు జనసేన అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే.