* హైదరాబాద్: నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఈ నెల 26వ తేదీ నుండి అమలు చేయబోయే ప్రభుత్వ పథకాలపై అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సీఎం సమావేశం..
* హైదరాబాద్: నేడు రవీంద్ర భారతిలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు.. ఓటర్స్ డే కార్యక్రమాల్లో పాల్గొననున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
* సంగారెడ్డి: సీపీఎం రాష్ట్ర 4వ మహాసభలకు ముస్తాబైన సంగారెడ్డి.. నేటి నుంచి 28 వరకు సీపీఎం రాష్ట్ర మహాసభలు.. నేడు సంగారెడ్డిలో భారీ ర్యాలీ.. PSR గార్డెన్స్ లో బహిరంగ సభ.. రేపటి నుంచి 28 వరకు గోకుల్ గార్డెన్స్ లో పార్టీ ప్రతినిధుల సభ.. 28న తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శి కార్యవర్గం ఎన్నిక
* ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా లో కనిష్ట ఉష్ణోగ్రతలు. కొమురం భీం జిల్లా సిర్పూర్ (యు)లో 9.8డిగ్రీలు గా నమోదు. ఆదిలాబాద్ జిల్లా పోచ్చర లో 11. డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. నిర్మల్ జిల్లా కుబీర్ లో 12.5గా నమోదు . మంచిర్యాల జిల్లా కోట పల్లి లో 13.8డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదు.
* యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట నేడు ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులు ఐక్యవేదిక మహా ధర్నా.. హాజరు కానున్న ఎంపీ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్.. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు.
* నిజామాబాద్ : నేడు జిల్లాలో పర్యటించనున్న బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేయనున్న 9 మంది సభ్యుల కమిటీ. మెండోరా మండలం బుస్సా పూర్, ఆర్గుల్ లో రైతుల తో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొననున్న కమిటీ
* ఆదిలాబాద్ జిల్లాలో బీ ఆర్ ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ . ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతు కుటుంబాలను నిన్న పరామర్శించిన రైతు అధ్యయన కమిటీ.
* నేడు మహబూబాబాద్ లో సిపిఐ శతాబ్ది ఉత్సవ సభ.. మహబూబాబాద్ 1967 లో తొలి నియోజవర్గ సీపీఐ ఎమ్మెల్యే తీగల సత్యనారాయణ.. విగ్రవిష్కరణ.. హాజరుకానున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు..
* ప్రకాశం : మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ లు అమరావతిలో ఉంటారు..
* ప్రకాశం : ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి..
* ప్రకాశం : ఒంగోలులో జెడ్పీ సీఈఓ చిరంజీవి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఎంపీడీవో లతో సమావేశం.. ఎంపీడీవో కార్యాలయాల నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష..
* విశాఖ: ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్లో ABVP మహాసభలు… నేడు శోభాయాత్ర….సెంట్రల్ పార్క్ దగ్గర బహిరంగ సభ
* రాష్ట్ర మంత్రులు నారాయణ..ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* విశాఖ: ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధి- ప్రత్యామ్నాయ విధానాలు పై ప్రాంతీయ సదస్సు… హాజరుకానున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఇరిగేషన్ నిపుణులు
* తిరుపతి: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నగరంలో రెవెన్యూ శాఖ అధ్వర్యంలో అవగాహన ర్యాలీ…
* విజయవాడ: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన ర్యాలీ.. హాజరుకానున్న ఏపీ సిఎస్ విజయనంద్, ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని
* విజయవాడ: నేడు టిడ్కో ఇళ్లను పరిశీలించనున్న tidco చైర్మన్ అజయ్ కుమార్
* అల్లూరి జిల్లా: ఏజెన్సీ ప్రజలను ఒణికిస్తున్న చలి పులి… సీజన్ కనిష్టం దిశగా రాత్రి ఉష్ణోగ్రతలు… ఏజెన్సీ వ్యాప్తంగా కొనసాగుతున్న చలి తీవ్రత… పాడేరు 07, మినుములూరు 05, జి.మాడుగుల 05, పెదబయలు 06.. అరకు 07, డంబ్రీగూడ 06, హుకుంపేట 07 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* కర్నూలు: ఆలూరు మండలం అరికేరి లో హత్యకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్ బండారి ఈరన్న కుటుంబాన్ని నేడు పరామర్శించునున్న జిల్లా వైసీపీ నేతలు… ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు నుంచి తప్పుకొని తమకు ఇవ్వాలని గత 2 నెలలుగా ఈరన్న పై ఒత్తిడి చేస్తున్న టీడీపీ వర్గీయులు
* తిరుమల: 9 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,665 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,051 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు
* విజయనగరం జిల్లా ఓటర్ల దినోత్సవం లో భాగంగా నేడు బొబ్బిలి రెవెన్యూ డివిజన్ అధికారి ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులచే ర్యాలీ నిర్వహించనున్నారు
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు పార్వతీపురంలో జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్న శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
* విజయనగరం: మెట్రో కన్వెన్షన్ హల్లో జరిగే 35వ జిల్లా రోటరీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్