Rajya Sabha Members: రాజ్యసభలో పెద్దలుంటారు.. వయసులో కాదు.. హోదాలో.. అందుకే పెద్దల సభ అంటారు. మరిక్కడ ఏం జరుగుతోంది.. కొంతమంది. పెద్దల వ్యవహార శైలి ఎందుకు విచిత్రంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలైన.. టీడీపీ, వైసీపీల్లో రాజ్యసభ సభ్యుల తీరు మరింత ఆశ్చర్యంగా.. ఇంకొంచెం విచిత్రంగానూ ఉంది.. సాయిరెడ్డి రాజీనామాతో ఈ చర్చ బాగా ఎక్కువగా జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ పదవుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేది.. ప్రధానంగా చంద్రబాబు ఆచి తూచి కొన్ని సందర్భాల్లో ఒత్తిడితో పదవులు ఇచ్చారు.. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక అయినవారు చాలా మంది పార్టీని వదిలి వెళ్ళిపోయారు.. రేణుక చౌదరి.. తులసి రెడ్డి.. సి రామచంద్రయ్య.. కిమిడి కళా వెంకట్రావ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి.. వంగా గీత.. మైసూరారెడ్డి.. మోహన్ బాబు.. ఇలా చాలా మంది రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి ఇతర పార్టీల్లో చేరిపోయారు.
Read Also: Mamatha Kulakarni: మహా కుంభమేళాలో సన్యాసం తీసుకున్న బాలీవుడ్ హీరోయిన్..
ఇక, 2019 ఎన్నికల తర్వాత సుజనా చౌదరి.. టీజీ వెంకటేష్.. సీఎం రమేష్.. గరికిపాటి రాంమోహన్ రావు.. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు.. అయితే వీళ్ళు ఇంకా పదవి కాలం ఉండగానే బీజేపీలో చేరారు.. ఒక్క కనకమేడల రవీంద్రబాబు ఒక్కరే మొన్నటి వరకు అంటే ఒక యేడాది కిందటి వరకు పదవిలో ఉన్నారు .. తర్వాత అసలు టీడీపీకి రాజ్యసభలో ఒకరు కూడా లేరు. ఇప్పుడు ఇదే సీన్ వైసీపీ లో కనిపిస్తోంది… విజయ్ సాయిరెడ్డి పార్టీకి.. రాజ్యసభకు కూడా రాజీనామా ఇచ్చేసారు.. వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు . ఇక్కడే అసలు రాజ్యసభ ఈ పార్టీలకు అచ్చి రావడం లేదా అనే చర్చ స్టార్ట్ అయ్యింది.. వైసీపీ నుంచి ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు జంప్ అయ్యారు. మోపిదేవి.. ఆర్ కృష్ణయ్య.. బీద మస్తాన్ రావ్.. ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి.. ఇక, మిగిలిన వైసీపీ బలం 6కు వచ్చేసింది.. ఇక, వీరిలో ఎవరు బయటకు వెళ్తారు అనేది కూడా చూడాలి.. గతంలో టీడీపీ నుంచి ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్లి బీజేపీలో చేరుతున్నారు.. అయితే బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువగా ఉంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ వైపు వెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.. వ్యాపార అవసరాలు.. ఇతర కారణాలు.. కేస్ లు కూడా వీటికి తోడవుతున్నాయనే చర్చ కుడా జరుగుతోంది..
Read Also: Private Junior Colleges: ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కోర్టులో దక్కని ఊరట.. విద్యార్థులపై భారం..
ప్రాంతీయ పార్టీలు అధికారం కోల్పోయిన పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు.. వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలి.. కానీ, కేవలం. రాజ్యసభ సభ్యుల విషయంలో మాత్రం ఒక ప్రత్యేక ఎజెండా తెరపైకి వస్తోంది.. దీంతో పవర్ పోతే ఆటోమాటిక్ గా జంప్ అయిపోతున్నారు.. పార్టీకి ఎంతో లాయల్ గా ఉన్నారని రాజ్యసభ సభ్యత్వాలు ఇస్తున్నారు.. కానీ, వాస్తవ పరిస్థితిలో వీటిని పక్కన పెట్టి జంప్ అవ్వడంతో ప్రాంతీయ పార్టీల్లో రాజ్యసభ సభ్యుల విషయంలో కొత్త చర్చ మొదలవుతోంది…