నేడు కోటి దీపోత్సవంలో ఆరవ రోజు. వైకుంఠ చతుర్దశి వేళ విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ, శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీలు అనుగ్రహ భాషణం.. శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ ప్రవచనామృతం.. భక్తులచే శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటి పుష్పార్చన.. ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం.. పల్లకీ వాహన సేవ.. వివిధ సంస్క్మృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణంరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఇక, రఘురామకృష్ణం రాజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సినిమా రంగంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో (రఘు రామకృష్ణం రాజు) 'ఆర్ఆర్ఆర్' కూడా ఓ సంచలనంగా పేర్కొన్నారు..
ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామన్నారు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి 11 నెలలవుతోంది. ఈ టైంలో రాష్ట్రం కోసం చాలా చేసినా... దాన్ని జనానికి సరిగా చెప్పుకోలేకపోతున్నామన్న అసంతృప్తి, అసహనం పెరుగుతున్నాయట ప్రభుత్వ పెద్దల్లో. దీంతో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా..? ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడి చేస్తున్నా.. అధికార పక్ష నాయకులు ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. ఖాళీగా పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో పలువురు నేతలను నియమించిన కూటమి సర్కార్.. తాజాగా శాసనసభ, శాసనమండలి చీఫ్ విప్, విప్‌లను నియమించింది. శాసనసభలో ముగ్గురు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం దక్కింది. శాసనసభ చీఫ్ విప్‌గా వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలి చీఫ్ విప్‌గా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ నియమితులయ్యారు.
పంచకర్ల రమేష్ బాబు...! గండి బాబ్జీ...! కూటమి పార్టీల్లో సీనియర్ నేతలు...కేరాఫ్ పెందుర్తి. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ శాసనసభ్యుడు. ఎన్నికల సమయంలో కలిసి వుంటే కలదు సుఖం అని డ్యూయెట్లు పాడుకున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందని జనసేన, టీడీపీ కేడరే తెగ చెవులు కొరికేసుకుంటోంది.
కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ యురేనియం పరీక్షలు, తవ్వకాలపై కీలక ప్రకటన చేశారు కలెక్టర్ రంజిత్ బాషా.. యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు.. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట యురేనియం ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని సీఎం చెప్పారు.. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కలెక్టర్ రంజిత్ బాషా..
మరోసారి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వర్క్ షాప్ నిర్వహించారు... అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ వంటి అవకాశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించడానికి ఈ వర్క్ షాప్ నిర్వహించారు.. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ఈ వర్క్ షాప్ లో మరింత ప్రాధాన్యత కల్పించారు... బడ్జెట్ పై పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.. అయితే, బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలి. మీకు వచ్చే…
అభివృద్ధి, సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని టీటీడీ బోర్డు మెంబర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై జగ్గంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు, అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.