MP Pilli Subhash Chandrababose: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి ఎక్స్ లో తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొనడం చర్చగా మారింది.. అయితే, వైసీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది.. పార్టీ ఆదేశాలతో ఢిల్లీ బయల్దేరారు వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయిరెడ్డి రాజీనామా తర్వాత పార్టీ ఆదేశాలు మేరకు ఢిల్లీలో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. ఒత్తిడితోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తానని చెప్పి ఉండొచ్చన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు బోస్.. వ్యాపారాలు ఉన్నవారికి ఒత్తిడి ఉంటుందని కూడా వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొనడంతో.. ఇప్పుడు ఢిల్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఉత్కంఠగా మారింది..
Read Also: Nigerian Army: నైజీరియా సైన్యం ఊచకోత.. 79 మంది ఉగ్రవాదులు హతం