CM Chandrababu: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు.. దావోస్ వేదిక గా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు… రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు.. .అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పని చేసే యువత ఉన్న దేశంగా భారత్ కు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
Read Also: Bihar : డబుల్ కాట్ బెడ్ కూడా సరిపోలేదు.. బీహార్ లో కట్టలు కూడబెట్టిన ప్రభుత్వ అధికారి
దావోస్ వేదికగా భారత్ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి చంద్రబాబు మాట్లాడారు. గతంలో దావోస్ కు ఒకరిద్దరు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చేవారని.. చరిత్రలో మొదటిసారి భారత్ తరఫున అందరం కలిసి మాట్లాడుతున్నామని చెప్పారు. దేశంలో వివిధ పార్టీల నుంచి వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా.. దావోస్ అందరం ఒక్కటేనన్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నా టీమ్ ఇండియాగా అందరిది ఒకే లక్ష్యం అన్నారు. భారత్ నుంచి దావోస్ సదస్సుకు హాజరు అవుతున్న వారిలో తానే సీనియర్ ను అని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. 1997 నుంచి దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు అవుతున్నట్టు ఆయన తెలిపారు. గతంలో భారత్ కు చాలా తక్కువ గుర్తింపు ఉండేదనీ ఇప్పుడు భారత్ కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి భారత్ కు ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ సానుకూలమైన అంశం అన్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అన్ స్టాపబుల్ అంటూ సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: Canada : అమెరికాలో ఇబ్బందుల్లో వేలాది మంది భారతీయులు.. ఇక కెనడా వంతు
రాజకీయాల్లో వారసత్వం పరిస్థితి వల్ల వస్తుందన్నారు.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు.. రాజకీయాలు జీవనోపాధి కాదన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా ఒకసారి మోసం చేసి అధికారంలోకి రావచ్చని.. ప్రతిసారీ అది సాధ్యం కాదన్నారు.. వికసిత భారత్ విజన్ తో వృద్ధి రేటు కోసం అంతా కలిసి పనిచేస్తే దేశాభివృద్ధి సాధ్యమేనని అన్నారు చంద్రబాబు… సుస్థిర వాతావరణం కోసం 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం గా భారత్ పని చేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో 165 గిగా వాట్లు విద్యుత్ ఏపీలోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని సీఎం అన్నారు. దావోస్ లో భారత్ లోని వివిధ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయని.. కానీ, అంతా ఐక్యంగా దేశం కోసం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రులు గా తాము వేర్వేరు పార్టీలకు చెందిన వారం అయినా ఐక్యంగా ఆలోచించేది దేశం కోసం ప్రజల కోసమని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, వ్యవసాయం, మానవాభివృద్ధి లో డీప్ టెక్ లాంటి సాంకేతికత రావాలని అన్నారు. పెట్టుబడులు ఆకర్షించడంలో, వృద్ధిరేటులో ఏపీ చాలా కృషి చేయాల్సి ఉందన్నారు. మరోవైపు ప్రపంచం నుంచి తీసుకెళ్ళడం కంటే దానికే సాంకేతికతను భారత్ అందిస్తోందని అన్నారు. వనరులు అవకాశాలను ప్రపంచానికి చూపుతున్నామని అన్నారు. 2047 కల్లా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని అన్నారు.
Read Also: Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే.. తల్లికి వచ్చే పెన్షన్ ఆపడం అన్యాయం!
ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందన్నారు చంద్రబాబు.. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈవోలు భారత సంతతికి చెందినవారే. సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత్ ప్రయోజనాలు పొందుతోంది. వ్యాపార దక్షత, నైపుణ్యాలు ఉన్న యువత, జనాభా ఎక్కువగా ఉండటం భారత్ కు వరాలు. ప్రపంచం మొత్తానికి ఇండియా సేవలందిస్తోంది. ప్రపంచంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యులు భారతీయులే అన్నారు.. ఇక, దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకుంటారు.. లోకేష్ ఇవాళ, రేపు కూడా దావోస్ లో ఉండే అవకాశం ఉంది.