AP Budget 2025: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది.. రూ.3,22, 359 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ బడ్జెట్ రూ.3,22,359 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.. రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లుగా.. ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.. మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంది.. అయితే, వివిధ అభివృద్ధి పథకాలకు భారీగా నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం.
Read Also: IITA Passing Out Parade: ఐఐటీఏలో డాగ్ స్క్వాడ్ పాసింగ్ అవుట్ పరేడ్.. డీజీకి పూలబొకే ఇచ్చిన జాగిలం!
బడ్జెట్‌లో డ్రిప్ ఇరిగేషనుకు పెద్ద పీట వేసింది.. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చింది.. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు బడ్జెట్‌లో వెల్లడించింది.. 4,300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లల్లో, ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తైనట్టు స్పష్టం చేసింది.. మిగిలిన 1300 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణం తుది దశలో ఉన్నట్టు బడ్జెట్టులో ప్రస్తావించారు.. నరేగా ద్వారా 72 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రణాళికలు వేసింది.. 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేలా పనులు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది.. ఇప్పటికే హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల వెడల్పు చేసే పనులు ప్రారంభమైనట్టు బడ్జెట్‌లో స్పష్టం చేసింది.. పాట్‌హోల్ ఫ్రీ ఆంధ్ర నినాదంతో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు.. మరమ్మత్తులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో, 17,605 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేసినట్టు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..
Read Also: Samsung Galaxy M06: అదిరిపోయే ఫీచర్లున్న మొబైల్‌ను రూ.9499కే తీసుకొచ్చిన శాంసంగ్
ఇక, తన బడ్జెట్ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ పేర్లను ప్రస్తావించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆయా సందర్భాల్లో వారు మాట్లాడిన కామెంట్లను.. తీసుకుంటున్న చర్యలను ప్రసంగంలో ప్రస్తావించారు ఏపీ ఆర్థిక మంత్రి..