Posani Krishna Murali: న్యాయమూర్తి ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి… పోసాని కృష్ణమురళికి 14రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాజంపేట సబ్‌జైలుకు తరలించారు పోలీసులు. అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు. వైద్య పరీక్షల అనంతరం నిన్నరాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోడూరు కోర్టుకు తరలించి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు.
Read Also: Cryptocurrency Scam : క్రిప్టోకరెన్సీ స్కామ్‌లో హీరోయిన్స్ తమన్నా, కాజల్ అగర్వాల్..?
అయితే, తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి.. తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారాయన. నా భార్యను దూషించిన బాధతో నేను మాట్లాడిన వీడియోలను అలా చూపించారు.. నా భార్యను దూషించిన దూషణలను కట్ చేసి వారిని దూషించిన మాటలను మాత్రమే చూపించారు.. నా భార్యను దూషించిన బాధతోనే నేను అలా దూషించాల్సి వచ్చిందంటూ న్యాయమూర్తి ఎదుట తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని ఒప్పుకున్న పోసాని.. నా భార్యను దూషించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో లేకుండా చేశారు ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి..