AP Budget 2025-26: నేడు ఏపీ బడ్జెట్.. రూ.3.20 లక్షల కోట్ల అంచనాలతో..
- నేడు అసెంబ్లీ ముందుకు ఏపీ బడ్జెట్..
- 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల..
- రూ.3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం..
- బడ్జెట్‌లో సూపర్ సిక్స్ స్కీంలకు ప్రాధాన్యత..
- అభివృద్ధి ప్రణాళికల బేరీజు వేసుకుని బడ్జెట్ రూపకల్పన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Budget 2025-26: ఇవాళ అసెంబ్లీ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 9గంటలకు కేబినెట్ అమోదించాక.. సభలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతోంది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. సూపర్ సిక్స్ పథకాలతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈసారి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించే మార్గాలతో పాటు మూలధన వ్యయం పెంచే విధంగా బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి విజన్ 2047 లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంటుంది. అందులో బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత 10 గంటలకు శాసనసభలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆర్ధిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెడతారు.
Read Also: Sabdham Movie Review: శబ్దం మూవీ రివ్యూ..ఆత్మహత్యలా? ఆత్మల హత్యలా ?
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
తల్లికి వందనం పథకంతో పాటు అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి పథకాలను అమలు చేయాల్సి ఉంది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతలను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారివారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ఆస్కారం ఉన్నట్టు సమాచారం. డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్ధికంగా చేయూతనిచ్చేలా వారికి వడ్డీలేనిరుణాల అంశాన్ని కూడా బడ్జెట్లో పేర్కోనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రీడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం. డిజిటల్ గవర్నెన్స్, ఐటీ హబ్‌ల అభివృద్ధి, పరిశ్రమల వృద్ధి తదితర రంగాల్లో ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర బడ్జెట్‌లో విద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పాఠశాలల మౌలిక సదుపాయాల మెరుగుదల, ఉచిత ఆరోగ్య సంరక్షణ పథకాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల బలోపేతం ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Read Also: Off The Record : డైలీ సీరియల్ లా సాగుతున్న తాడిపత్రి పాలిటిక్స్
అసెంబ్లీలో మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెడితే.. వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే.. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. 2024 జూలైలో అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తి స్థాయిలో ప్రవేశ పెడుతున్న బడ్జెట్ కావడంతో.. ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. దేశంలోనే రెండ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!