సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్కు దిగారు.. పోలవరం పర్యటన తర్వాత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అనేక అబద్దాలు చెబుతున్నారు.. అసలు పోలవరాన్ని ప్రారంభించింది కట్టాలనుకున్నది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని.. కానీ, పోలవరాన్ని తానే కడుతున్నట్లుగా చంద్రబాబు కథలు చెబుతున్నారు.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని, బతిమిలాడి మేం కడతామని చెప్పి తీసుకున్నారు... ఇది చారిత్రాత్మక తప్పిదం అంటూ ఫైర్ అయ్యారు..
రేపు గుంటూరు జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించనున్న నేపథ్యంలో.. విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికార యంత్రాంగం... మంగళగిరి AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనడం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... రేపు ఉదయం 11:20 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకోనున్న రాష్ట్రపతి.. మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.
మరోసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. గత వైసీపీ ప్రభుత్వం వల్లే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు... ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పోలవరం, అమరావతి రెండు కళ్లుగా భావించామన్న ఆయన.. పోలవరం రాష్ట్రానికి జీవనాడి.. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందని వెల్లడించారు.
మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.. మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని సతీమణి జయసుధ.. అయితే, పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైన విషయం విదితమే.. రేషన్ బియ్యం అక్రమాలపై అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
రాజధాని అమరావతితో హైవేల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాంగా రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ.. అమరావతితో హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్లను పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. హైవే నుంచి అమరావతికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ అనుమతులపై మంత్రికి వివరించారు అధికారులు.
రేవతి కుటుంబానికి మరోసారి క్షమాపణ చెప్పిన అల్లు అర్జున్.. అనుకోకుండా జరిగిన ఈ ఘటన పట్ల చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.. ఇక, చికిత్స పొందుతున్న రేవతి కుమారుడిని నేను వెళ్లి పరామర్శిస్తాను అని చెప్పారు అల్లు అర్జున్.. అంతే కాదు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మరోసారి హామీ ఇచ్చారు..
ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ బీజేపీలో చేరారు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షతులై ఎత్తుండా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్.. కమలం పార్టీలో చేరారు.. ఇక, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార కండవాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు.
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలీ అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అంటున్నారు.. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అని గుర్తుచేశారు.. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏదిపడితే అది మాట్లాడుతోందని దుయ్యబట్టారు.. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి.. వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని సెటైర్లు చేశారు.
పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నేత, తాడిపత్రి మున్సిపల్చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఐదు నెలలైనా... నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ఆరోపిస్తున్నారు జేసీ..